Breaking News

12/08/2019

హాంగ్ కాంగ్ లో అందోళన ఉదృతం

న్యూఢిల్లీ, ఆగస్టు12 (way2newstv.in):
హాంగ్ కాంగ్ మళ్లీ ఆందోళనకరంగా మారింది. నిరసనకారులు వరుసగా నాలుగువ రోజు భారీ ప్రదర్శన చేపట్టారు.  హాంగ్ కాంగ్  వీమానాశ్రయ టర్మినల్లో ఆందోళనకారుల ప్రదర్శనతో పలు విమానాలను రద్దు చేశారు.  ప్రపంచంలో అత్యంత బిజీ విమానాశ్రయాల్లో హాంగ్ కాంగ్ ఒకటి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. చాలా తీవ్ర స్థాయిలో విమాన రాకపోకలు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్పారు.  
హాంగ్ కాంగ్ లో అందోళన ఉదృతం

ఆందోళనకారులపై పోలీసులు సోమవారం ఉదయం  టియర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో అక్కడున్న నిరసనకారులు ఇవాళ ఎయిర్పోర్ట్ను పూర్తిగా స్తంభింపచేశారు. సుమారు వంద  ఫ్లయిట్లను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు. ఇటీవల నేరస్థుల అప్పగింత బిల్లును హాంగ్ కాంగ్  లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  దాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసన చేపట్టారు.హాంగ్ కాంగ్ పై చైనా అజమాయిషీని ఆందోళనకారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. నిరసనకారులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని తాజాగా చైనా అధికారులు ఆరోపణలు చేశారు.

No comments:

Post a Comment