Breaking News

02/08/2019

ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల  ఆగస్టు 02 (way2newstv.in)
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహనతో పాటు అప్రమత్తత అవసరమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ ఆన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లోని ఎస్సీ , ఎస్టీ హాస్టల్ లో ఎమ్మెల్యే సూచనల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ,మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్బంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గోని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం నుండి వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు    ప్రభలే అవకాశం ఉందన్నారు , వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని వైద్య ఆరోగ్య శాఖ కు సూచించారు .ప్రజలు విషయంలో జాగ్రత్తలు వహించి , పరిశుభ్రత పాటించాలని కోరారు 
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సీఎం   కేసీఆర్ ముందుకు

.ఈ సీజనల్ వ్యాధుల వల్ల జలుబు , తలనొప్పి , జ్వరం , వాంతులు , విరోచనాలు  లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని , ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి వ్యాధులు ప్రబల కుండ ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని  కోరారు . ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖా మంత్రి వర్యులు ఈటెల రాజేందర్ ఇప్పటికే వైద్యులు అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు .జిల్లా కేంద్రంలో ఉన్న 4  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  పూర్తి స్థాయిలో వైద్యుల కేటాయింపు జరిగిందన్నారు , వీరికి సహకారంగా అదనంగా మరో 10 మంది వరకు పారా మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు .అలాగే జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో గతం కంటే రెట్టింపు స్థాయిలో  వైద్యాలను నియమించామని గుర్తు చేశారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా  ముఖ్యమంత్రి కేసీఆర్  ముందుకు వెళ్తున్నారన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో ఎస్సీ , ఎస్టీ హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి , మందులు  సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు .అడగగానే స్పందించి పాఠశాల సమయానికి కంటే ముందు వచ్చి ప్రేమతో , అంకితభావంతో , మానవతాహృదయంతో  స్పందించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తో పాటు, జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ , డా. భీమేష్ , డా శ్రీనివాస్ , శశికాంత్, ఫార్మసిస్ట్ పరమేష్ , వార్డెన్ కమలాకర్, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు ..

No comments:

Post a Comment