Breaking News

02/08/2019

తారకమ్మకు ముఖ్యమంత్రి ఘన నివాళి

వనపర్తి  ఆగస్టు 2 (way2newstv.in)
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి  తారకమ్మకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హైదరాబాద్ నుంచి కొత్తకోట మీదుగా వనపర్తి పట్టణంలో నీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. తారకమ్మ దశదిన కార్యక్రమం సందర్భంగా ఇంటిలో మరియు ఇంటి ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 
తారకమ్మకు ముఖ్యమంత్రి ఘన నివాళి

తారకమ్మ దశ దిన కర్మ సందర్భంగా భారీ ఎత్తున ఆమె చిత్రపటాన్ని పూలమాలలతో ఏర్పాటుచేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే .చంద్రశేఖరరావు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా మంత్రి నిరంజన్ రెడ్డి ఓదార్చుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పరామర్శించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో వనపర్తి చేరుకున్న ఆయన మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెరాస నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment