జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి ,ఆగస్టు 02 (way2newstv.in)
హరిపురం గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా ముత్తారం మండలంలోని హరిపురం గ్రామాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. గ్రామం అంతా కలెక్టర్ పర్యటిస్తూ నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత ఇంటి వారికి తెలియజెసారు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన గ్రామ సమావేశంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ముత్తారం మండలంలో అధికంగా డెంగ్యూ వ్యాధి కేసులు వచ్చాయని, అపరిశుభ్రత , నీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు అధికంగా అక్కడ పెరుగుతాయని, తద్వారా ప్రజలు అనారొగ్యం పాలవుతారని , దీని నివారించేందుకు గ్రామంలో పరిశుభ్రత పాటించాలని, వర్షాకాలం ప్రారభమయినందున మన ఇంటి వద్ద నిర్మించిన సోక్ పిట్లో వర్షపు నీరు ఇంకిపోయె విధంగా ప్రతి ఇంట్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామంలో ఎవరి ఇంటి వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
హరితవనంగా హరిపురం గ్రామాన్ని తీర్చిదిద్దాలి
అదే విధంగా గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా 5 కమ్యూనిటి సోక్ పిట్ నిర్మాణం చేపడుతున్నామని, వాటిని అధికారులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో పరిశుభ్రత ఉండే విధంగా చుడాల్సిన బాధ్యత గ్రామ అధికారులు, గ్రామ సర్పంచ్ పై అధికంగా ఉందని అన్నారు. గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామంలోని పరిశుభ్రత పై రోజువారి పురోగతి ఉండే విధంగా కార్యాచరణ రుపొందించుకోవాలని, ప్రతి రోజు గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటించేలా చుడాలని, పరిశుభ్రత పాటించని వారి పై నూతన పంచాయతి రాజ్ చట్టం ప్రకారం జరిమానా విధించి విధిగా వసూళ్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులకు ప్రజలతో మంచి సంబంధాలుంటాయని, వాటిని వినియోగించుకుంటూ పరిశుభ్రత పాటించడం, పచ్చదనం పెంపొందించుకోవడం వల్ల కలిగే లాభాలను వారికి వివరిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలను సైతం భాగస్వామ్యులను చేయాలని కలెక్టర్ సూచించారు. హరిపురం గ్రామంలో 100% సోక్ పిట్ల నిర్మాణం పూర్తయిందని, ప్రజలు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఇంటి ముందు ఉన్న నాళాలను పూడ్చుకోవాలని, గ్రామంలో ఎట్టి పరిస్థితులలో నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నూతన పంచాయతిరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో నాటిన మొక్కలలో 85% బ్రతికి వృద్ది చెందాలని, ఆ విధంగా గ్రామ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, గ్రామంలో 4 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించాలని, మంచి ఎత్తులో ఉన్న మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటాలని, వాటికి తప్పనిసరిగా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని, వాటికి నీటి సరఫరా కోసర అవసరమైన కార్యాచరణ రుపొందించి అమలు చేయాలని, వృద్ది చెందే ప్రతి మొక్కకు ప్రభుత్వం ప్రతి నెల రూ.5/- అందిస్తుందని, వీటిని వినియోగించుకుంటూ పెద్ద ఎత్తున మొక్కలను నాటి సంరక్షించాలని కలెక్టర్ తెలిపారు. ఇంటింటా హరితలక్ష్మీ పేరిట ఈ సంవత్సరం ప్రతి ఇంటికి 5 మొక్కలు అందిస్తున్నామని, ఆగస్టు 9,2019 నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలోని ప్రతి ఇంట్లో ఒకే సమయంలో 5 మొక్కలు (2 నీడ కల్పించే చెట్లు, 3 పండ్లు, పూల మొక్కలను) నాటాలని, ఆ మొక్కలను తప్పనిసరిగ్గా సంరక్షించాలని కలెక్టర్ తెలిపారు. మన ఇంట్లో ఉండే పశువుల ఆ మొక్కలను మేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, పంచాయతి సిబ్బంది ఆ మొక్కల పెంపుదలకు సంబంధించి ప్రజలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మొక్కలను సంరక్షించని వారి పై జరిమానాలు విధించాలని కలెక్టర్ అన్నారు. మన భవిష్యత్తు తరాలకు మంచి జీవనం సాగించే పర్యావరణం ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని కలెక్టర్ అన్నారు. గ్రామాలో ప్లాస్లిక్ వినియోగాన్ని వీలైనంతవరకు నివారించాలని, ప్లాస్లిక్ అధికంగా వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, మన ఇంట్లో వినియోగించే ప్లాస్టిక్ కు సంబంధించిన వస్తువుల చెత్తను ప్రత్యేకంగా సేకరించి గ్రామ పంచాయతికి అప్పగించాలని, పంచాయతి సిబ్బంది ప్రతి ఇంటి నుండి ప్రత్యేకంగా ప్లాస్టిక్ ను సేకరించి దాని విక్రయించడం ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. పిల్లలకు మంచి పౌష్లికాహారం అందించాలని, దాని కోసం ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఎర్పాటు చేసుకునేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హరిపురం గ్రామంగా నూతనంగా ఏర్పాటు అయినందను గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి అనువైన భూమికి సంబంధించిన సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, ఎస్సారెస్పీ కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి సంబంధింత శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని, దానికి గ్రామస్థులు సైతం శ్రమదానం చేసి సహకరించాలని కలెక్టర్ అన్నారు. రేషన్ షాపులో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత మందికి రేషన్ అందడం లేదని తెలుసుకున్న కలెక్టర్ , వాటికి పరిష్కారం చుపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరర జిల్లా కలెక్టర్ హరిపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించారు, దీని మరమ్మత్తులు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి తనకు అందజేయాలని అవసరమైన నిధులను కేటాయిస్తానని కలెక్టర్ తెలిపారు. హరిపురం గ్రామంలో అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ కింద ప్రభుత్వం అందించే సాయం అందే విధంగా అధికారులు చొరవ తీసుకొని పనిచేయాలని కలెక్టర్ అన్నారు.మంథని ఆర్డివో కె.నగేష్ , జిల్లా పంచాయతి అధికారి వి.సుదర్శన్, జిల్లా పౌరసంబంధాల అధికారి శ్రీధర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, ముత్తారం తహసిల్దార్, సర్పంచ్ సంపత్ రావు, ఎస్సి ఎస్టి అట్రాసిటి సభ్యుడు శ్రీనివాస్, మాజి సర్పంచ్ అశోక్, గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, త దితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
No comments:
Post a Comment