Breaking News

28/08/2019

మేనల్లుడిపైనే బాబు ఆశలు

హైద్రాబాద్, ఆగస్టు 28, (way2newstv.in
నందమూరి కుటుంబం ఒక్కటిగా లేకపోవడం వల్లనే టీడీపీ పగ్గాలు నారా వారి చేతుల్లోకి వెళ్లాయన్నది అందరికీ తెలిసిందే. కన్న తండ్రి, పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ ని పక్కన పెట్టేసి మరీ బావ చంద్రబాబుకు ఇద్దరు కృష్ణులూ పాతికేళ్ళ క్రితం కిరీట ధారణ చేశారు. ఇపుడు నారా చేతుల్లో ఉన్న పార్టీ పగ్గాలు ఏనాటికైనా తనకు దక్కుతాయని బాలకృష్ణ బాగానే ఆశ పడుతున్నారు. సరిగ్గా ఇదే ఆశతో గతంలో దివంగత నేత నందమూరి హరికృష్ణ పార్టీలోనూ బయటా పోరాడి అలసిపోయి చివరికి జీవితాన్నే చాలించారు. ఇక తాజాగా టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీ ఘోర పరాజయం, తరువాత చంద్రబాబుకు వయోభారం దృష్ట్యా పార్టీలో కీలకం అవుదామని బాలయ్య అనుకుంటున్నట్లుగా కూడా ప్రచారంలో ఉంది. 
మేనల్లుడిపైనే బాబు ఆశలు

నిజానికి పార్టీ ఘోర పరాజయం పాలు అయిన తరువాత టీడీపీ కాడి మోయడానికి బాలయ్య ఓ దశలో సినిమాలు కూడా వదులుకుని రావడానికి సిధ్ధపడ్డారు. ఏ షూటింగు పెట్టుకోకుండా ఖాళీగా ఉన్నారు . అయితే చంద్రబాబు ఏ కీలకమైన బాధ్యత అప్పగించకపోవడమో విసుగు చెంది మళ్ళీ ముఖానికి రంగు పూసుకున్నారని అంటారు.ఇదిలా ఉండగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య హరికృష్ణ ప్రధమ వర్ధంతి సందర్భంగా నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్ళినపుడు మేనల్లుడు జూనియర్ తో ఏకాంత చర్చలు జరిపారు. ఓ విధంగా జూనియర్ అవసరం పార్టీకి ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఏదో విధంగా ఆయన్ని టీడీపీ వైపు మళ్ళించాలనుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యమే గెలిస్తే జూనియర్ టీడీపీలోకి వస్తారన్న కంగారు ఎక్కడో బాలయ్యకు ఉన్నట్లుంది. పైగా తాను పార్టీలో కీలకంగా ఉన్నా తనను పట్టించుకోకుండా జూనియర్ ని దువ్వడం కూడా బాలయ్యకు అసలు నచ్చడం లేదని ప్రచారం కూడా ఉంది. ఈ పరిణామాలకు సమాధానంగానే చిన్నల్లుడు వ్యూహాత్మకంగానే జూనియర్ అవసరం టీడీపీకి లేదనిపించేసారు. బాలయ్య గురి చూసి రాజకీయ బాణం వదిలాడని అంతా అనుకుంటున్నారు. ఇటు బావకు, అటు జూనియర్ కు కూడా ఒకే సారి జవాబు ఇవ్వాలన్నదే బాలయ్య ఉద్దేశ్యం.బాలయ్యకు జూనియర్ కి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. అందువల్ల జూనియర్ టీడీపీలోకి వచ్చి తన కంటే ముందు వరసలో నిలబడి పార్టీని లీడ్ చేస్తానంటే బాలయ్య వూరుకోరు. దాంతో చిన్నల్లుడు ద్వారా ఓ సందేశం పంపించారని టాక్ నడుస్తోంది. ఇపుడు బాలయ్య విదేశాల్లో షూటింగులో ఉన్న టైంలో చిన్నల్లుడు గళం విప్పారు అంటే అది వ్యూహాత్మకమేనని కూడా అంటున్నారు. ఈ కారణంతోనే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ జూనియర్ అవసరం పార్టీకి లేదనేశాడు. ఆయన అలా అనడం వెనక బాలయ్య ఆశీస్సులు బాగా ఉన్నాయన్న ప్రచారం ఎటూ ఉంది.జూనియర్ ని పార్టీలోకి తెస్తే తాను తప్పుకుంటానన్న సందేశం కూడా అందులో ఉంది. మొత్తానికి చూసుకుంటే పైకి జూనియర్ కి అటాక్ ఇచ్చినట్లుగా ఉన్నా బావ చంద్రబాబుకు కూడా బాలయ్య ఇండైరెక్ట్ గా తన మనసులోని మాటను చెప్పేశారు. ఇక బంతి చంద్రబాబు కోర్టులోనే ఉంది. మరో వైపు జూనియర్ సైతం ఈ కామెంట్స్ ని సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాను రాజకీయల్లోకి రావాలంటే ఒకరి అనుమతి అవసరమా అన్న కోణంలో అయన ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక జూనియర్ ఇపుడు సినిమాల బిజీలో ఉన్నారు. ఆయన సరైన సమయం చూసుకుని తన ప్రతిస్పందనను తెలియచేస్తారని కూడా అంటున్నారు. జూనియర్ సంగతి పక్కన పెడితే ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం శ్రీభరత్ కామెంట్స్ పట్ల బాగా కలత చెందారని కూడా అంటున్నారు. మరి నందమూరి కుటుంబంలో రాజుకున్న ఈ వివాదానికి ముగింపు ఎపుడో, ఎక్కడో, అది ఎలాంటి పరిణామాల‌కు దారి తీస్తుందో, . ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలే.

No comments:

Post a Comment