Breaking News

27/08/2019

అంతరాష్ట్ర హవాలా ముఠా అరెస్టు రూ. 5 కోట్లు స్వాధీనంచేసుకున్న పోలీసులు

హైదరాబాద్ ఆగష్టు 27  (way2newstv.in - Swamy Naidu)
అంతరాష్ట్ర హవాలా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న రూ. 5 కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడిస్తూ ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు రెండు కార్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 
అంతరాష్ట్ర హవాలా ముఠా అరెస్టు రూ. 5 కోట్లు స్వాధీనంచేసుకున్న పోలీసులు
హైదర్‌గూడలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గుజరాత్‌కు చెందిన వీరు హవాలా రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. డీసీపీ టాస్క్‌పోర్స్ రాధాకృష్ణ నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేసిన బృందాన్ని సీపీ ఈ సందర్భంగా అభినందించారు.

No comments:

Post a Comment