Breaking News

27/08/2019

సిటీ క్లీన్, అభివృద్ది కార్యక్రమాల కొనసాగింపు తక్షణ కర్తవ్యం

జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్
హైదరాబాద్, ఆగష్టు 27  (way2newstv.in)
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్.ఆర్.డి.పి, డబుల్ బెడ్ రూం తదితర అభివృద్ది కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించనున్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ పేర్కొన్నారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా నేడు ఉదయం బాధ్యతలను స్వీకరించిన అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను ప్రత్యేక దృష్టితో పూర్తిచేయడానికి తగు చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. వివిధ శాఖల సమన్వయంతో నగరవాసులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. 
సిటీ క్లీన్, అభివృద్ది కార్యక్రమాల కొనసాగింపు తక్షణ కర్తవ్యం 

జిహెచ్ఎంసి అధికారులందరూ నగర ప్రజలకు ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తామని అన్నారు. ట్రాఫిక్ ఫ్రీ వ్యవస్థ ఏర్పాటుకు చేపట్టిన ఎస్.ఆర్.డి.పి కి కావాల్సిన భూసేకరణ చేపట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. జిహెచ్ఎంసిలో అవినీతి రహిత పాలన అందించేవిధంగా కృషిచేస్తామని చెప్పారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనం సాఫిగా జరిగేందుకు సంబంధిత లైన్ డిపార్ట్ మెంట్ లతో సమన్వయంతో పనిచేయనున్నట్టు స్పష్టం చేశారు. మేయర్ ను కలిసిన కమిషనర్జి హెచ్ఎంసి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డి.ఎస్.లొకేష్ కుమార్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ కార్యాలయంలో బొంతు రామ్మోహన్ ను కలిసి నగరంలో చేపట్టాల్సిన ప్రాధాన్యత అంశాలు, గణేష్ నిమజ్జన కార్యక్రమం, ఎస్.ఆర్.డి.పి, డబుల్ బెడ్ రూం, స్వచ్ఛ సర్వేక్షణ్, నగరంలో రోడ్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. కాగా కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన లొకేష్ కుమార్ ను జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లు, సిసిపి తదితర ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

No comments:

Post a Comment