Breaking News

27/08/2019

కుషాయిగూడ ఇ.సి.ఐ.ఎల్ మార్గంలో మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ – బొంతు రామ్మోహన్

హైదరాబాద్, ఆగష్టు 27  (way2newstv.in - Swamy Naidu)
కుషాయిగూడ నుండి ఇ.సి.ఐ.ఎల్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం, బస్ డిపో నుండి కుషాయిగూడ వరకు యూటర్న్ ల ఏర్పాటు, రోడ్డు విస్తరణ, ఇ.సి.ఐ.ఎల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ తదితర పనులను చేపట్టాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మౌలాలి, కుషాయిగూడ, ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ ఫ్రీ రవాణా వ్యవస్థ ఏర్పాటు పై జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, ట్రాఫిక్, జలమండలి, హెచ్.ఎం.డి.ఏ  అధికారులతో కలిసి ఇ.సి.ఐ.ఎల్, కుషాయిగూడ ప్రాంతాల్లో నేడు ఉదయం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కుషాయిగూడ డిపో నుండి ఇ.సి.ఐ.ఎల్ వరకు యూ టర్న్ ల ఏర్పాటు చేయడంతో పాటు రహదారుల విస్తరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 
కుషాయిగూడ ఇ.సి.ఐ.ఎల్ మార్గంలో మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ – బొంతు రామ్మోహన్
కుషాయిగూడ బస్ డిపో నుండి బస్సులు బయటకు వచ్చే మార్గం అత్యంత రద్దీగా ఇరుకుగా ఉన్నందున డిపో మార్గాన్ని మార్చాలని సూచించారు. ఇ.సి.ఐ.ఎల్ జంక్షన్ ను అభివృద్ది చేయాలని, ఇందుకు అవసరమైతే ఆస్తులను సేకరించాలని మేయర్ సూచించారు. కుషాయిగూడ నుండి డి మార్ట్ మార్గంలో రోడ్డు విస్తరణ చేపట్టి ఇ.సి.ఐ.ఎల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ కు సూచించారు. చక్రీపురం వద్ద ఇప్పటికే మంజూరు అయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. చిన్న చర్లపల్లిలో బస్ బే ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలని సూచించారు. మల్లాపూరం ఎన్.ఎఫ్.సి చౌరస్తా రహదారి విస్తరణ పనులను చేపట్టాలని సూచించారు.  

No comments:

Post a Comment