తారక మ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు
వనపర్తి జూలై 24 (way2newstv.in):
తల్లిని కోల్పోయి శోక సముద్రంలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు కాంగ్రెస్, బిజెపి నాయకులు పరామర్శించి తారక మ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు బుధవారం మంత్రి నిరంజన్ రెడ్డి నీ పానగల్ లోని వ్యవసాయ క్షేత్రంలో కలుసుకొని వారు వారి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మంత్రిని ఓదార్చారు. ఈ సందర్భంగా సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరికొందరు వ్యవసాయ క్షేత్రం లోకి చేరుకోగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించిన శాసనసభ స్పీకర్
మంత్రి నిరంజన్ రెడ్డి ని ఆలింగనం చేసుకుని సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తల్లిని కోల్పోయి ఎంతో దిగులుగా ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి ని ఓదార్చి ఆశీర్వదించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్త సుఖేందర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ కళాశాల వైస్ ఛాన్స్లర్ ప్రవీణ్ రావు, ఎస్పి అపూర్వ రావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరామి రెడ్డి, బిజెపి నేత శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని తారక మ్మ చిత్రపటానికి మాలలు వేసి ఘన నివాళులు అర్పించి మంత్రి నిరంజన్ రెడ్డి ని ఓదార్చారు.
No comments:
Post a Comment