Breaking News

25/07/2019

జమిలీకి ముందు అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన

హైద్రాబాద్, జూలై 25, (way2newstv.in)
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు కేంద్రం అడుగులు వేగవంతం చేసిందా? ఇప్పటికే దానికి సంబంధించిన కేబినెట్‌ నోట్‌ను ఈసీకి పంపిందా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఏపీ, తెలంగాణ సహా రెండు రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఇప్పటికే చేపట్టినట్టు తెలుస్తోంది. పునర్విభజనకు సంబంధించి ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్ణయం చెప్పాలంటూ ఒక కేబినెట్ నోట్‌ను ఇప్పటికే ఈసీకి పంపినట్లు సమాచారం. స‌మాచార హాక్కు చ‌ట్టం కింద ఓ వ్యక్తి వివరణ కోరగా ఈసీ ఈ వివరాలను వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, సిక్కింతో పాటు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీట్ల పెంపుపై ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ, హోంశాఖలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఏపీలో 225 సీట్లు, తెలంగాణలో 151 సీట్లకు పెరగనున్నాయి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 
జమిలీకి ముందు అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన

కొన్ని కీలకమైన సవరణలు చేయాల్సిన నేపథ్యంలోనే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ సవరణలతో బిల్లును గట్టేక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలతో దేశం మొత్తం పట్టు బిగించే… వ్యూహాత్మక అడుగుల్లో… అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కూడా చేర్చింది. మొత్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పునర్విభజించనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది ఈ ప్రక్రియ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ముగించబోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో తమ రాజకీయ సమీకరణాలను చూసుకున్న తర్వాతే కేంద్రం ఈ ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండో సారి గెలిచిన తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదాన్ని వినిపిస్తున్న కేంద్రం వీలైనంత త్వరగా నాలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. త్వరలో డిలిమిటేషన్‌ కమిషన్‌ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌, సిక్కిం, ఏపీ, తెలంగాణలకు కలిపి ఒకే పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపును పరిశీలించాలని ఉంది. పరిశీలనలో సాధ్యం కాదని.. మోడీ సర్కార్ తేల్చింది. అప్పట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ ఒత్తిడి చేసినా పరోక్షంగా మద్దతుగా నిలిచిన టీఆర్ఎస్ పదే పదే విజ్ఞప్తి చేసినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. చివరికి ఏమీ లేదని తేల్చేసింది. అనూహ్యంగా మోడీ 2.O సర్కార్ మాత్రం అసెంబ్లీ సీట్ల పెంపును సీరియస్‌గా తీసుకుంది. అయితే.. ఇది పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలు చేయడానికి కాదు. బీజేపీ సొంత రాజకీయ ప్రయోజనాలు నేరవేర్చుకోవడం కోసం. జమ్మూ కశ్మీర్‌, సిక్కింతోపాటు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని కేంద్రం గట్టి నిర్ణయిం తీసుకుందని చెబుతున్నారు. సీట్ల పెంపునకు ఇప్పటికే బిల్లును కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసింది. కేంద్ర న్యాయ, హోం శాఖలు గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చాయంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో హిందూ సీఎం ఉండాలంటే కచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకే.. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తోంది. రాష్ట్రపతి పాలననే కొనసాగిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో సీట్లు పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తోంది కేంద్రం. ఎలాగూ జమ్మూకశ్మీర్ కోసం కసరత్తుచేయాల్సి ఉన్నందున.. మిగిలిన రాష్ట్రాలకూ కలిపి.. ఒకే సారి పునర్విభజన చేస్తే సరిపోతుదందని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ఆర్టికల్‌ 170 సవరిస్తూ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు, చేర్పులు చేయకుండ సీలింగ్ పెట్టారు. అందుకే రాజ్యాంగ సవరణ అవసరం అవుతోంది.

No comments:

Post a Comment