Breaking News

24/07/2019

400 తగ్గిన బంగారం ధర

ముంబై, జూలై 24  (way2newstv.in):
పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.36,300కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా రూ.390 తగ్గుదలతో రూ.33,110కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. 
400 తగ్గిన బంగారం ధర

కేజీ వెండి ధర రూ.44,230 వద్దనే ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా క్షీణించింది. పసిడి ధర ఔన్స్‌కు స్వల్పంగా 0.02 శాతం క్షీణతతో 1,421.55 డాలర్లకు తగ్గింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 16.48 డాలర్లకు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.35,200కు క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గుదలతో రూ.34,000కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర రూ.44,230 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. 

No comments:

Post a Comment