Breaking News

05/07/2019

చిన్న వ్యాపారులకు పెన్షన్


న్యూఢిల్లీ, జూలై 5, (way2newstv.in)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2019లో చిన్న వ్యాపారులకు వరాలు ప్రకటించింది. దేశంలోని సుమారు మూడు కోట్ల చిన్నవ్యాపారులకు పెన్షన్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు శుక్రవారం బడ్జెట్ ప్రసంగలో ఆర్థిక మంత్రి వెల్లడించారు. వార్షికాదాయం 1.5 కోట్ల క‌ంటే త‌క్కువ ఆదాయం ఉన్న రిటైల్ వ్యాపారులు, దుకాణ యజమానులకు 'పెన్షన్' ప్రయోజనాలు క‌ల్పించ‌నున్నట్లు ఆమె తెలిపారు. 

 చిన్న వ్యాపారులకు పెన్షన్

'ప్రధాన‌మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన' కింద ఈ కొత్త 'పెన్షన్' పథకం వ‌ర్తిస్తుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్న మ‌ధ్యశ్రేణి సంస్థల‌కు 2 శాతం వ‌డ్డీతో రుణాలు ఇవ్వనున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ఇందుకోసం దాదాపు 350 కోట్ల నిధులను కేటాయించామన్నారు. నిధుల స‌మీక‌ర‌ణ కోసం 'సోష‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్'ను ఏర్పాటు చేయ‌నున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 

No comments:

Post a Comment