Breaking News

05/07/2019

భారీగా పెరిగిన బంగారం


న్యూఢిల్లీ, జూలై 5, (way2newstv.in)
బులియన్‌ మార్కెట్‌కు  బడ్జెట్‌ షాక్‌  తగిలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలువైన లోహాలపై  సుంకాన్ని పెంచడంతో ధరలు  అమాంతం పుంజుకున్నాయి.  దేశీయ బంగారు ఫ్యూచర్స్ బంగారం భారీగా పుంజుకుంది. దేశీయ బంగారు ఫ్యూచర్స్  మార్కెట్‌లో 2 శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి.


భారీగా పెరిగిన బంగారం

 పది గ్రాముల  బంగారం ధర రూ. 712  ఎగిసి రూ. 34929 వద్ద కొనసాగుతోంది.  మరో విలువైన మెటల్‌ వెండి కూడా ఇదే బాటలో ఉంది. కిలో వెండి ధర 633 రూపాయలు ఎగిసి 38410 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం  ఔన్స్‌  ధర 1,415 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. అమెరికా  జాబ్‌డేటా, వడ్డీరేటుపై ఫెడ్‌ ప్రకటన తదితర అంశాల నేపథ్యంలో ఈ వారంలో ధరలు 2 శాతానికి పైగా పెరిగిన పుత్తడి వరుసగా ఏడవ వారం కూడా లాభాల  పరుగుతీస్తోంది. మరోవైపు దిగుమతి సుంకం పెంపువార్తలతో  జ్యుయల్లరీ షేర్లు 2-7శాతం పతనమయ్యాయి.  టైటాన్ కంపెనీ 3.1 శాతం, గోల్డియం ఇంటర్నేషనల్ 6.7 శాతం, లిప్సా జెమ్స్ 3 శాతం, పీసీ జ్యుయలర్‌ 4.84 శాతం, రినయిన్స్‌ జ్యుయల్లరీ 2 శాతం, తంగమాయి జ్యువెలరీ 5.8 శాతం, త్రిభువన్‌ దాస్ భీంజీ జవేరి 6.4 శాతం  నష్టపోతున్నాయి. కాగా  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బంగారం , ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 12.5శాతానికి  పెంచుతున్నట్టు ప్రకటించారు.  ప్రస్తుతమున్న 10 శాతం నుంచి బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment