Breaking News

18/07/2019

ఆరోగ్యంగా ఉన్నప్పుడే చురుగ్గా విధులు

వనపర్తి  జూలై 18 (way2newstv.in)
ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరింత చురుగ్గా విధులు నిర్వహించగలమని, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ అపూర్వ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్  సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా క్యాంపు ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకు పని ఒత్తిడి పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అందులోనూ పోలీసులు విధులలో సరైన సమయం అంటూ లేక నిద్ర సరిగ్గా లేని విధులను నిర్వర్తిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపక అనారోగ్యం పాలవుతున్నారని ఆమె అన్నారు. అదేవిధంగా విధుల్లో నిమగ్నమై ఉంటూ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపలేకపోతున్నరు అని ఆమె అన్నారు. 
ఆరోగ్యంగా ఉన్నప్పుడే చురుగ్గా విధులు

ఏదైనా ప్రాథమిక దశలో ఉన్నప్పుడే సరైన చికిత్స అందిస్తే ఆరోగ్యాన్ని సులువుగా కాపాడుకోగలమని ఆమె అన్నారు. పోలీసులు ప్రతిరోజు కనీసం ఒక గంట నైనా వ్యాయామం చేయాలని, ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుని ఏమైనా సమస్యలు ఉంటే ప్రాథమిక దశలో మందులు వాడి వాటిని అరికట్టవచ్చని ఆమె అన్నారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన వైద్య బృందానికి ఎస్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది, ఆర్మీ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, జిల్లా పోలీసు అధికారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని వైద్యం పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సాయి కుమార్, కార్డియాలజిస్ట్ డాక్టర్ పని చక్రవర్తి, డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్స్ సౌమ్య శ్రీ, పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో ఎస్పి అపూర్వ రావుతో పాటు సీఐ సూర్య నాయక్ ,రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, పట్టణ ఎస్సై నరేందర్, శిక్షణ ఎస్సై ఉమా, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సికిందర్, ఎస్ పి పి ఆర్ ఓ రాజ గౌడు బండారు సుదర్శన్ పోలీసులు , హోమ్ గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment