Breaking News

18/07/2019

పీఎంవై ఇళ్లకు రివర్స్ టెండర్ సెగ

విశాఖపట్టణం, జూలై 18, (way2newstv.in)
షీయర్‌ వాల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఇక నుండి కొత్తగా పనులు ప్రారంభం కావాల్సిన వాటికి సాధారణ పద్ధతిలోనే ఇళ్లు నిర్మించేందుకు రివర్స్‌ టెండర్లు పిలుస్తామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. అందుకు ఎంత సమయం పడుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మూడో దశలో 35,899 పిఎంఎవై ఇళ్లకు టెండర్లు పిలవగా 11,527 ఇళ్ల నిర్మాణానికి రూ.673 కోట్లకు టాటా సంస్థ, 24,372 ఇళ్లకు రూ.1445 కోట్లకు ఎల్‌అండ్‌టి సంస్థ టెండర్లు దక్కించుకున్నాయి. ఇప్పటి వరకు టాటా 1608, ఎల్‌అండ్‌టి 4800 గృహాల పనులే ప్రారంభించాయి. ఇవి కూడా కొన్ని పునాదులు, మరికొన్ని కాంక్రీటు పనుల దశల్లోనూ ఉన్నాయి. ప్రభుత్వ జిఒ ప్రకారం టెండర్‌ అంచనాలో 25 శాతం పనులు పూర్తి కానందున వీటిని నిలిపివేశారు. 
పీఎంవై ఇళ్లకు రివర్స్ టెండర్ సెగ 

ఒకటి, రెండు దశల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు చివర దశలో ఉండటంతో వాటిని నిలిపివేసే అవకాశం లేదు. షీయర్‌ వాల్‌ టెక్నాలజీలో గోడలను ఇటుకలతో కాకుండా అచ్చుల్లో కాంక్రీట్‌ వేస్తారు. శ్లాబ్‌ కూడా ఇనుప ప్రేమ్‌లపై తేలికగా నిర్మిస్తున్నారు. ఈ అచ్చులు మలేసియా, సింగపూర్‌ నుంచి తెప్పిస్తున్నారు. వీటి కొరత కూడా నిర్మాణాలు ఆలస్యం కావడానికి కారణమన్న విమర్శలున్నాయి. నిర్మాణ ఖర్చును చదరపు అడుగు ధర రూ.1867 చొప్పున విశాఖలో టెండర్లు దక్కించుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎపి టిడ్కో 300 చదరపు అడుగులకు రూ.6,46,200 కాగా, 365చదరపు అడుగుల ఇంటికి రూ.7,42,045, 430 చదరపు అడుగుల ఇంటికి రూ.8,36,780 చొప్పున గతంలో ధర నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం షీయర్‌ టెక్నాలజీకి స్వస్తి పలుకుతున్నందున ధరలు తగ్గించే అవకాశం ఉంది.గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నాలుగు దశల్లో 1,55,067 ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన గృహాలను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో ఒకటి, రెండు, మూడు దశల్లో మంజూరైన 55,499 ఇళ్లకే టెండర్లు పిలిచారు. నాలుగో ఏడాది 97,568 ఇళ్లు మంజూరైనప్పటికీ వాటికి టెండర్లు పిలవలేదు. 2015లో ఈ స్కీమ్‌ ప్రారంభమైనప్పుడే జివిఎంసికి దాదాపుగా రెండు లక్షల దరఖాస్తులు అందాయి. ఒక్క గృహం కూడా పూర్తిగా నిర్మించలేదు. టిడిపి ప్రభుత్వం ఎన్నికలు సమీపించడంతో 2019 జనవరి, ఫిబ్రవరిలో దరఖాస్తుదారుల్లో అర్హులైన 41,823 మందితో దాదాపుగా రూ.86 కోట్ల వరకూ డిపాజిట్లు తీసుకుంది. వారికి మంజూరు పత్రాలు అందించింది. ఇందులో రూ.42 కోట్ల ఎపి టిడ్కోకు చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే గృహాలు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే డిపాజిట్లు చెల్లించిన వారి సంగతేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. జివిఎంసి పరిధిలో 41,823 మందికి తిరిగి డిపాజిట్లు చెల్లిస్తారా? లేదా? అన్న అనుమానాలున్నాయి. లబ్ధిదారుల వాటా కట్టించుకుని, బ్యాంకులు ఇచ్చే రుణాన్ని మాత్రమే ప్రభుత్వం భరించేందుకు ఆలోచిస్తున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. పూర్తి విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించకపోవడంతో లబ్ధిదారుల్లో ఆయోమయం నెలకొంది.

No comments:

Post a Comment