Breaking News

18/07/2019

ఏసీబీ కస్టడీకి కేశంపేట తహసీల్దార్‌ లావణ్య

హైదరాబాద్‌ జూలై 18  (way2newstv.in)
ఏసీబీ ప్రత్యేక కోర్టు కేశంపేట తహసీల్దార్‌ లావణ్యను కస్టడీకి అనుమతించింది. ప్రత్యేక కోర్టు తహసీల్దార్‌ లావణ్యను రెండ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అధికారులు లావణ్యను విచారించనున్నారు. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. 
 ఏసీబీ కస్టడీకి కేశంపేట తహసీల్దార్‌ లావణ్య

ఏసీబీ అధికారులు లావణ్యను రేపు కస్టడీకి తీసుకోనున్నారు. వీఆర్‌వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్‌ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఏకంగా రూ.93 లక్షల అక్రమ నగదును పట్టుకున్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment