Breaking News

03/07/2019

పోలీసులు అదుపులో నటుడు శివాజీ


హైదరాబాద్, జూలై 3, (way2newstv.in)
ప్రముఖ నటుడు, ఆపరేషన్ గరుడా ఫేం శివాజీని బుధవారం ఉదయం  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీవీ౯ కు సంభందించి అలంద మీడియా కేసులో శివాజీపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు అతని కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు పారిపోయేందుకు శివాజీ యత్నించినట్లు, ఆదే సమయంలో  సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

పోలీసులు అదుపులో నటుడు శివాజీ

తరువాత శివాజిని సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. శివాజీ శంషాబాద్ నుంచి అమెరికాకు పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ గతంలోనే శివాజీపై లుకౌట్ నోటీసులు జారీచేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న హీరో శివాజిని సైబర్ క్రైమ్ పోలీసులు కొంత సేపు విచారించి తిరిగి  ఈ నెల 11 వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందచేశారు. 

No comments:

Post a Comment