Breaking News

03/07/2019

గ్రామ వాలంటీర్ల నియామకంలో పూర్తి పారదర్శకత


ఏలూరు, జూలై, 3 (way2newstv.in)
 గ్రామ వాలంటీర్ల నియామకంలో పూర్తి పారదర్శకత పాటించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు  రేవు ముత్యాలరాజు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి యంపిడివోలు, తాహశీల్దార్లు, తదితరులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామ వాలంటీర్లు నియామకాలు, స్వచ్ఛ మహోత్సవ్, జల్‌శక్తి అభయాన్ కార్యక్రమాలను కలెక్టర్ సమీక్షించారు. గ్రామ వాలంటీర్ల నియామకానికి అందిన ధరఖాస్తులను సంబంధిత యంపిడివోలే స్వయంగా పరిశీలన చేయాలన్నారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని ధరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఎ ప్పటికప్పుడు వాటిని పరిశీలన చేయాలని, ఈ ప్రక్రియను జూలై, 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు


       గ్రామ వాలంటీర్ల నియామకంలో పూర్తి పారదర్శకత


ధరఖాస్తుల తిరస్కరణలో ఎ టువంటి ఆరోపణలకు తావులేకుండా అందుకు సంబందించి రిమార్కులను స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఒకొక్క గ్రామ వాలంటీరు పరిథిలో వచ్చే ఇళ్ల మ్యాపింగ్ ను చేసేందుకు అవసరమైన బృందాలను వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. మున్సిపాలిటీ పరిథిలో సంబంధిత రెగ్యులర్ ఉద్యోగులతో బృందాలను నియమించాలన్నారు. గుర్తించిన ఇళ్ల సంఖ్యకు అనుగుణంగా ఎ ంత మంది గ్రామ వాలంటీర్లు అవసరమో స్పష్టంగా తెలియజేయాలన్నారు. జూలై, 11వతేదీ నుండి 25వ తేదీ వరకు గ్రామ వాలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్వ్యూలకు జిల్లా స్థాయి అధికారులను కూడా కమిటీలలో నియమించడం జరుగుతుందని, ఈ దృష్ట్యా గ్రామ వాలంటీర్ల ఎంపిక కు సంబందించిన నియమ నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. స్వచ్ఛ మహోత్సవ్ నిర్వహణపై కలెక్టరు మాట్లాడుతూ మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్బంగా అక్టోబరు,2న భారత ప్రధాని స్వచ్ఛ మహోత్సవ్ కింద దేశంలో ఓడియఫ్ ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ దృష్ట్యా జూలై, ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో ఇందుకు సంబందించి పెద్దఎ త్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ఎ క్కడైనా ఇంకా నిర్మాణం పూర్తి చేయవలసిన టాయిలెట్లను పూర్తి చేయడం, వినియోగించని వాటిని వినియోగంలోనికి తీసుకురావడం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ మూడు నెలలు ప్రతీ బుధవారం స్వచ్ఛభారత్ కింద స్వచ్ఛామహోత్సవ్ కార్యక్రమాలను ప్రతీ గ్రామంలో నిర్వహించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను ఇప్పటికే ఓడియఫ్‌గా ప్రకటించినందున దానిని సుస్థిరం చేసే కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. స్వచ్ఛగ్రహిస్, మండల కోఆర్డినేటర్లు, పంచాయితీ కార్యదర్శులకు, తదితరులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ధరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. జల్‌శక్తి అభయాన్ కింద జిల్లాలో ఎంపికైన పెదవేగి, జంగారెడ్డిగూడెం మండలాలతో పాటు, మిగిలిన మండలాల్లో కూడా జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ఈ కార్యక్రమం కింద బోర్ వెల్స్ రీఛార్జి, వర్షపునీరు సంరక్షణ, వాటర్ షెడ్‌లు ఏర్పాటు, మొక్కలు నాటడం, నీటికాలుష్యం తగ్గించడం వంటి కార్యక్రమాలను ఉపాధి హామీతో అనుసంధానం చేసుకుని, సంబంధిత శాఖలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 
ఇద్దరు పంచాయితీశాఖ సిబ్బంది సస్పెన్షన్
 వీడియో కాన్ఫరెన్స్ సమయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు పంచాయితీ సిబ్బందిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టరు  రేవు ముత్యాలరాజు జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. పెదవేగి మండలం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న  యస్.యస్.శ్రీనివాస్,  జగదీష్‌కుమార్ లు పంచాయితీ సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ సమయంలో క్రమశిక్షణా రాహిత్యంగా సెల్‌ఫోన్ వినియోగించడాన్ని కలెక్టరు తీవ్రంగా పరిగణించారు. సదయ సమయంలో సమీక్షించే అంశం గురించి వారిని కలెక్టరు ప్రశ్నించగా, వారి నుండి ఎ టువంటి సమాధానం రాలేదు. దీంతో కలెక్టరు వారిని బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తించారని, వీరిపై చర్యలు తీసుకోవాలని డిపివోను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారి  ఆర్.విక్టర్ , జిల్లా పరిషత్ సిఇవో  వి.నాగార్జునసాగర్ , డ్వామా పిడి  సిహెచ్.మాలకొండయ్య, ఆర్ డబ్ల్యూఎ స్ ఎ స్ఇ  అమరేశ్వరరావు, తదితరులు పాల్గోన్నారు.

No comments:

Post a Comment