Breaking News

05/07/2019

తెలంగాణకు అన్యాయం జరిగింది : కొత్త ప్రభాకరరెడ్డి


న్యూఢిల్లీ, జూలై 5, (way2newstv.in)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పెదవి విరిచారు. ఏ రాష్ట్రానికీ ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే ప్రకటనలు ఏమీ లేవని అన్నారు. ప్రతి ఇంటికి తాగు నీరు అందించేందుకు కేటాయింపులు చేయడం సంతోషకరమని... అయితే, ఇప్పటికే ఆ పథకాన్ని మిషన్ భగీరథ పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు.

 తెలంగాణకు అన్యాయం జరిగింది : కొత్త ప్రభాకరరెడ్డి

 తమ పథకాన్నే పేరు మార్చి బడ్జెట్ లో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీకి బడ్జెట్లో ప్రతిపాదనలు లేవని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని అన్నారు. టీఆర్ఎస్ మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, మిషన్ భగీరథకు ఆర్థికసాయం చేసి ఉంటే బాగుండేదని చెప్పారు. బంగారంపై సుంకాన్ని పెంచారని... దీని వల్ల సామాన్యులకు ఇబ్బంది అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బడ్జెట్ ఉందని చెప్పారు.

No comments:

Post a Comment