Breaking News

05/07/2019

భారత అభివృద్ధిని పరుగులు పెట్టించేలా బడ్జెట్ :మోడీ

న్యూఢిల్లీ, జూలై 5, (way2newstv.in)
మోదీ 2.0 ప్రభుత్వ తొలి బడ్జెట్ ను లోక్ సభలో ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ దేశ ప్రగతికి మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ... తాజా బడ్జెట్ దేశ ప్రజల ఆశలు... ఆకాంక్షలు నెరవేరుస్తుందని అనుకుంటున్నాను. నవభారత నిర్మాణానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. వ్యవసాయరంగంలో పలు సంస్కరణలు చేపట్టాం. వ్యవసాయరంగానికి మేలు చేసిదిగా ఈ బడ్జెట్ నిలుస్తుంది. మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. యువత కలలు, సంకల్పం నెరవేరేలా బడ్జెట్ రూపొందించాం. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర పెంచే విధంగా బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ విద్యావిధానాన్ని బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దేశం నిరాశా వాతావరణం నుంచి బయటపడిందన్నారు. బడ్జెట్ సులభతరహా జీవన విధానానికి ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ఇది అత్యుత్తమ బడ్జెట్ అని కితాబిచ్చారు. 
భారత అభివృద్ధిని పరుగులు పెట్టించేలా బడ్జెట్ :మోడీ

భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ అని ప్రశంసించారు. 21వ శతాబ్దంలో భారత అభివృద్ధిని పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉందని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల పారిశ్రామికరంగం బలపడుతుందని, దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు. పన్ను విధానాన్ని సరళతరం చేశామని చెప్పారు. మౌలిక వసతులను ఆధునికీకరించేలా బడ్జెట్ ను తీర్చిదిద్దామని అన్నారు. వ్యవసాయరంగాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైనవి బడ్జెట్ లో ఉన్నాయని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి  చేకూరుతుందని మోదీ అన్నారు. 10 ఏళ్ల విజన్ తో రూపొందించాం : నిర్మలాసమ్మిళిత ఆర్థిక అభివృద్ధే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పదేళ్ల విజన్‌తో బడ్జెట్‌ రూపొందించామని తెలిపారు. గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. పట్టణాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు బడ్జెట్‌ తోడ్పాటును అందిస్తుందన్నారు. ఈ బడ్జెట్‌ వల్ల మధ్యతరగతి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. స్టార్టప్‌ కంపెనీలకు పెద్దమొత్తంలో పన్ను రాయితీలు ఇస్తామన్నారు. కాలుష్యం తగ్గించేందుకే విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో విద్యుత్‌ వాహనాల తయారీ పరిశ్రమలు పెరుగుతాయి. మన బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఎన్‌బీఎఫ్‌సీలు ఇబ్బందిగా మారాయి అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

No comments:

Post a Comment