Breaking News

05/07/2019

సామాన్యుడికి పెట్రో, బంగారం భారం


న్యూఢిల్లీ, జూలై 5, (way2newstv.com)
మధ్యతరగతి ప్రజలకు కేంద్రం షాకిచ్చింది. వరాలు కురిపిస్తుందనుకున్న బడ్జెట్ వారిపై పన్నుల భారం మోపింది. పెట్రోలు, డీజిల్, బంగారం ధరలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి మధ్యతరగతిపై కొరడా ఝళిపించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం (జులై 5) లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌పై ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. 

 సామాన్యుడికి పెట్రో, బంగారం భారం


అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై కస్టమ్స్ సుంకాన్ని రూ.1 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రభావంతో.. 380.25 పాయింట్ల వ‌ద్ద ట్రేడింగ్ ప్రారంభించిన భార‌త్ పెట్రోలియం షేర్లు.. 2.42 శాతం పతనమయ్యాయి. మరోవైపు బంగారంతో పాటు విలువైన ఇతర లోహాలపై దిగుమతి సుంకాన్ని 2.5 శాతం పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు బంగారంపై ఉన్న దిగుమతి సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి చేరినట్లయింది. సుంకాలు పెంచడంతో పెట్రోలు, డీజిల్, బంగారం ధరలు మ‌రింత పెర‌గ‌నున్నాయి.

No comments:

Post a Comment