Breaking News

22/07/2019

రాపాక... కండువా మార్చేస్తారా..

కాకినాడ, జూలై 22, (way2newstv.in)
లిచింది ఓ పార్టీలో దూరేది మరో పార్టీలో. ఈ కధ ఇపుడు బాగా పాతదైపోయింది. చొక్కాల కంటే దారుణంగా పార్టీలు మార్చేస్తున్న రోజులివి. ఫిరాయింపుల కంపు ఓ వైపు కొడుతూంటే విలీనం వాసనలు మరో వైపు ఘాటెక్కిస్తున్నాయి. తాము చేసిన దాన్ని అందంగా సమర్దించుకోవడానికి విలీనం అనేస్తున్నారు. సరే ఇవన్నీ ఇలా ఉంటే మరో కొత్త రకం రాజకీయం మొదలైంది. ఉన్న పార్టీలోనే కొనసాగుతూ వేరే పార్టీల అధినేతలను పొగడడం. రానున్న రోజుల్లో ఇది కూడా బాగా పాపులర్ అవుతుందేమో చూడాలి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఓ వైపు టీడీపీ, మరో వైపు, వైసీపీ, జనసేన పోరాడాయి. బంపర్ మెజారిటీతో వైసీపీ గెలిచింది. టీడీపీ పరిస్థితే అతలాకుతలం అయింది. 
రాపాక... కండువా మార్చేస్తారా..

ఇక జనసేన ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుంది. ఆ గెలిచిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాదరావు పూర్వాశ్రమంలో వైఎస్సార్ భక్తుడు, ఇపుడు జగన్ కి కూడా భక్తుడైపోయారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన జగన్ ని ఏకంగా దేవుడుగా కీర్తించేశారంటే ఎంతలా అధికార పక్షం వైపు చూస్తున్నారో అర్ధమవుతోంది.తండ్రి వైఎస్సార్ బాటలోనే జగన్ పయనిస్తున్నారని, వ్యవసాయాన్ని పండుగ చేసిన వైఎస్సార్ కంటే మరో రెండడుగులు ఎక్కువగా వేసి జగన్ రైతులకు మేలు చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే వరప్రసాదరావు అసెంబ్లీ సాక్షిగా తెగపొగిడారు. అడగకుండానే మత్సకారులకు వరాలిచ్చిన జగన్ వారికి నిజమైన దేవుడు అయ్యాడని కూడా అన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు వైసీపీ సభ్యులు బల్లలు చరిచారంటే ఎంతలా భజన చేసి ఉంటారో అర్ధమైపోతుంది. ఇలా జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ జగన్ ని పొగడడానికి రీజన్ కూడా ఉంది. ఆయన వైఎస్సార్ చలువతోనే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆయన వైసీపీ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే జగన్ టికెట్ ఇవ్వలేనని చెప్పడంతోనే జనసేన వైపు చూశారు. ఓ విధంగా ఆయన వైసీపీ మనిషి కిందనే లెక్క అంటున్నారు.జనసేన ఎపుడూ జగన్ ను మెచ్చుకోలేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇటీవల అమెరికా పర్యటనలో కూడా జగన్ ని జైలు నుంచి వచ్చిన నాయకుడంటూ ఎగతాళి చేశారు. పవన్ రాజకీయ దోస్తీ అంతా టీడీపీతోనే సాగింది. ఇక తాజా బడ్జెట్ పై ఆ పార్టీ నేత పార్ధసారధి ఘాటు విమర్శలే చేశారు. అంతా అభూత కల్పనగా పేర్కొన్నారు. మరో వైపు పవన్ సైతం జగన్ విషయంలో అదే దూకుడుతో ఉన్నారు. విత్తనాలు దొరకని రైతులు రొడ్డెక్కుతున్నారని, వారి విషయంలో చర్యలు తీసుకోండంటూ ముఖ్యమంత్రికి తొలి లేఖ రాశారు. ఈ విధంగా జనసేన స్టాండ్ ఉంటే రాపాక వర ప్రసాద్ ఇలా జావగారిపోవడం ఏ రకమైన సందేశం ఇస్తున్నట్లు అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

No comments:

Post a Comment