Breaking News

16/07/2019

జగన్ దూకుడుతో టీడీపీ డీలా

విజయవాడ, జూలై 16, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ ఎలాంటి పార్టీ, ఆనాడు అన్న ఎన్టీయార్ సినీ లోకం నుంచి ఇలలోకి దిగివచ్చి చైతన్య రధంపై శ్రీక్రుష్ణుడిలా శంఖం పూరిస్తూ తెలుగు వీధుల్లో తిరుగుతూంటే ఆయన ఉపన్యాసాలతో రాజకియ భగవద్గీత బోధనలతో యావత్తు తెలుగుజాతి చైత‌న్యమైంది. ఆ తరువాత కదా ప్రతి ఒక్కరికీ ఓటు విలువ తెలిసివచ్చింది. కట్టు బానిసలుగా తమను మార్చేసి ఏలుతున్న ఖద్దరు పెద్దలను వెళ్ళగొట్టి మరీ ఓ విప్లవంలా టీడీపీని తీసుకువచ్చి అన్న గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అంటే ఎన్టీయార్ యుగ పురుషుడు అయితే టీడీపీ చరిత్ర స్రుష్టించిన పార్టీ. ఎన్నికల్లో పోటీ చేయడం అంటే టీడీపీకి జంకూ బొంకూ లేదు. అవతల వారు ఎంతటి వారు అయినా విజయం సైకిల్ పార్టీదే. 
జగన్ దూకుడుతో టీడీపీ డీలా

అంత ధీమా. ప్రజల్లో అంతటి అభిమానం. ఇదంతా ఎన్టీయార్ తోనే పోయినట్లుంది. లేకపోతే ఇపుడు చరిత్ర తిరగబడి కుర్ర నేత జగన్ చేతిలో టీడీపీ దారుణంగా ఓడిపోవడం ఏంటి.ఇక జగన్ కి ఏం అనుభవం ఉంది. ఆయన ఏం పాలించగలడు అని ఎద్దేవా చేసింది టీడీపీ. జగన్ కి ఈ ప్రజలు అధికారం ఇవ్వరు, ఆయన ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరు.. ఈ మాటలు అన్నది కూడా టీడీపీనే. కానీ జరిగిందేంటి. టీడీపీని మట్టిగొట్టుకుపోయేలా జగన్ ఓడించేశాడు. సరే ఆ తరువాత కూడా ఎక్కడా తడబాట్లు, పొరపాట్లు లేవు, జగన్ దూకుడు తగ్గడంలేదుగా. ఆయన వేగం ఆగడం లేదుగా. సామాజిక న్యాయం తో మంత్రి వర్గ విస్తరణ చేపడితే టీడీపీ కి ఏం అనాలో తెలిసింది కాదు. ఇక ఇపుడు బడ్జెట్ మెరుపులు చూసి ఏకంగా ఖంగు తినాల్సి వస్తోంది. జగన్ మొత్తం బడ్జెట్లో అధిక భాగం తన హామీలు నెరవేర్చేందుకే కేటాయించి తాను చేతల సీఎం అని నిరూపించుకున్నాడు.ఇదే భయం ఇపుడు ఆ పార్టీలో పట్టుకుంది. అదేంటి దాదాపు నలభయ్యేళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. నిన్నటి వరకూ అధికారంలో ఉన్న పార్టీ. ఎందుకు మరచిపోతారు. కానీ జనం ఎపుడు ఏ పార్టీకి గుత్త సొత్తు కాదు, కాలం కలసిరాకపోతే మరచిపోవచ్చు కూడా. నూటా ముప్పయ్యేళ్ళ కాంగ్రెస్ సంగతి ఏమైంది. కళ్ల ముందే ఆ పార్టీ పతనం అయిపోతోంది. మరి అంత కంటే గొప్ప పార్టీ కాదుగా. జనానికి ఎవరు చేరువగా ఉంటారో ఎవరు మేలు చేస్తారో వారిని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. ఈ సంగతి బాగా తెలిసిన పెద్ద నాయకుడు కాబట్టే యనమల రామక్రిష్ణుడు టీడీపీని జనం గుండెల్లో నుంచి మీరు మరచిపోకుండా చేయ‌లేరంటూ జగన్ మీద బాణాలు విసురుతున్నారు. యనమల బుర్రలో ఆ మాట పుట్టిందంటే కొండంత గుబులు టీడీపీకి మొదలట్లేగా.

No comments:

Post a Comment