Breaking News

06/07/2019

కొత్తిమీర కొండెక్కింది


హైద్రాబాద్, జూలై 6, (way2newstv.in)
మార్కెట్లలో ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. కొత్తి మీర ధర కొండెక్కి కూర్చుంది.  చిన్న కట్ట రూ.15 నుంచి 20 పలుకుతోంది. గతంలో రూ.3  నుంచి రూ.5లు ఉండేది. పుదీన కూడా రూ.20   పలుకుతోంది. తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు రూ. 6 నుంచి 10 రూపాయలు.  సరైన కాలంలో వర్షాలు పడక పోవడమే కారణమని అధికారులు, రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.

కొత్తిమీర కొండెక్కింది

 శామీర్‌‌పేటకు చెందిన మహిళా రైతు అరుణ మాట్లాడుతూ నెల రోజులుగా వర్షాలు పడక ఆకుకూరల మాల్ దొరకడం లేదని,  ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి విక్రయిస్తున్నామన్నారు. ‘ఎండలు తగ్గడం లేదు. సరిగ్గా వానలు పడట్లేదు. వేసిన ఆకు కూరలు ఎండిపోతున్నాయి. బోర్ల కింద పండించి పొలాల నుంచి తెప్పిస్తున్నాం. దీంతో ధర ఎక్కువై ప్రజలు కొత్తమీర కొనడం లేదు’ అని ఎర్రగడ్డ  రైతుబజార్‌‌కు చెందిన ఆకు కూరల వ్యాపారి రాములు చెబుతున్నారు. ఎర్రగడ్డ రైతు బజార్ ఎస్టేట్‌‌ అధికారి రమేష్‌‌ మాట్లాడుతూ ‘రైతులు కొత్త పంటలు వేయడానికి పొలాలను సిద్ధం చేసుకున్నారు. అయితే సకాలంలో వర్షాలు కరవలేదు. గతేడాది ఈ సమయానికి  పంట వేసేవారు. ఈ ఏడాది పాత పంటలు లేవు, వర్షాలు లేక  కొత్తగా సాగు చేయలేదు, అందుకే రేట్లు పెరిగాయి’ అని చెప్పారు.  కొత్తిమీర కట్ట రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండడంతో అది లేకుండానే వంట చేసుకుంటున్నామని వినియోగదారులంటున్నారు.

No comments:

Post a Comment