Breaking News

29/07/2019

జూరాలకు ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ

మహబూబ్ నగర్ జూలై 29  (way2newstv.in)
జూరాలకు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. నారాయణపూర్ ప్రాజెక్టు 18 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టు 18 గేట్లను అధికారులు ఎత్తివేశారు. లక్ష రెండు వేల 420 క్యూసెక్కుల నీరు జూరాలకు విడుదల చేశారు. 
జూరాలకు ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ 

ఈ అర్ధరాత్రికి వరద జూరాలకు చేరుకునే అవకాశం ఉంది.కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్కు భారీ వరద వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండడానికి సిద్ధంగా ఉండడంతో ఎగువ నుంచి వచ్చే వరద నేరుగా దిగువన తెలంగాణలోకి రానుంది. ముందస్తు చర్యల్లో భాగంగా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

No comments:

Post a Comment