Breaking News

03/07/2019

ఐకాన్ గాళ్‌గా నివేతా పేతురాజ్


హైద్రాబాద్, జూలై 3, (way2newstv.in)
మెంటల్ మదిలో’ చిత్రంతో పరిచయమై తదుపరి చిత్రం చిత్రలహరితోనే కెరీర్‌ను ట్రాక్‌లో పెట్టేసింది నివేతా పేతురాజ్. తాజాగా వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలోనూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో -ఐకాన్ గాళ్‌గా మారే అవకాశం దక్కబోతోందని అంటున్నారు. చిత్రలహరిలో ఇన్నోసెంట్ బబ్లీగాళ్‌గా కనిపిస్తూనే, ఎమోషనల్ సీన్స్‌లో ఆడియన్స్‌ని మెప్పించిన నివేత -పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. దాంతో త్రివిక్రమ్ -అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్టులో సెకెండ్ హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. 

ఐకాన్ గాళ్‌గా నివేతా పేతురాజ్

ప్రధాన కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్దె నటిస్తోంది. తాజాగా ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలో తన స్క్రీన్ ప్రజెన్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లటం, ఆ సినిమా హిట్టు టాక్ కూడా అందుకోవడంతో -తదుపరి ప్రాజెక్టును బన్నీ ఆమెను సిఫార్స్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. నా పేరు సూర్య.. తరువాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న బన్నీ, త్రివిక్రమ్‌తో ప్రాజెక్టు చేస్తూనే.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టునూ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే సంక్రాంతికి ఒక సినిమా, సమ్మర్ సీజన్‌కు మరో సినిమా ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. వేణు శ్రీరామ్ చేయనున్న ప్రాజెక్టుకు ‘ఐకాన్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు కూడా. ఆ ప్రాజెక్టులో బన్నీ సరసన లీడ్‌రోల్ నివేతా పేతురాజ్ చేయొచ్చని తెలుస్తోంది. అదే జరిగితే నాలుగు సినిమాలతోనే టాలీవుడ్‌లో -ఐకాన్ గాళ్‌గా నివేతకు పేరు రావడం ఖాయం.

No comments:

Post a Comment