Breaking News

03/07/2019

పడిపోతున్న భూగర్భజలాల్లో తెలంగాణ 4వ స్థానం


హైద్రాబాద్, జూలై 3, (way2newstv.in)
ఎన్ని రోజులు గ్రౌండ్ వాటర్ను మనం తోడుకున్నాం. ఇప్పుడు భూమిలోకి మనమే నీళ్లు పంపించాల్సిన దుస్థితి వచ్చింది. రాష్ట్రంలోని 137 మండలాల్లో (బ్లాకుల్లో) భూగర్భ జలాలు అడుగంటినట్టు కేంద్ర జల వనరుల శాఖ సర్వేలో తేలింది. ఈ 137 మండలాలు 23 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల విచ్చలవిడి వాడకానికి ఇది అద్దం పడుతోంది. ఈ 137 బ్లాకుల్లో రీచార్జ్‌‌‌‌ షాఫ్టుల ద్వారా భూమిలోకి నీళ్లు పంపనున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు ‘మిషన్‌‌‌‌ జల్‌‌‌‌శక్తి అభియాన్‌‌‌‌’ పేరిట దేశవ్యాప్తంగా నీటి రీచార్జ్‌‌‌‌  ప్రోగ్రామ్ను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోని 255 జిల్లాల్లో 1593 బ్లాకుల్లో భూగర్భ జలాలు ప్రమాదకర రీతిలో పడిపోయినట్లు గుర్తించింది. తమిళనాడులో అత్యధికంగా 341 బ్లాకులు ఉంటే, రాజస్థాన్‌‌‌‌ (218), ఉత్తరప్రదేశ్‌‌‌‌ (139) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 137 బ్లాకులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.2017–-18లో రాష్ట్ర భూగర్భ జల వనరులశాఖ (జీడబ్ల్యూడీ) చేసిన సర్వేలో 70 మండలాలు, 1818 ఊళ్లల్లో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయినట్టు గుర్తించింది. ఈ గ్రామాల్లో బోర్లు వేయొద్దని, కొత్త బోర్లకు కరెంట్ సప్లయ్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. 
పడిపోతున్న భూగర్భజలాల్లో తెలంగాణ 4వ స్థానం

ఇక్కడ భూగర్భ జలాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ‘రీచార్జ్‌‌‌‌ షాఫ్ట్‌‌‌‌’ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. నీటి ప్రవాహాలకు అడ్డంగా చెక్‌‌‌‌డ్యాంలు నిర్మిస్తే, అక్కడ నీరు నిలిచి భూమిలోకి ఇంకుతుంది. అయితే, ఈ పద్ధతిలో చాలా తక్కువ మొత్తంలో నీరు భూమిలోకి చేరుతుంది. అవే చెక్‌‌‌‌డ్యాంలలో 40 మీటర్ల లోతుకు బోర్లు తవ్విస్తున్నారు. ఆ బోర్లలో మట్టి, ఇసుక చేరకుండా బోర్‌‌‌‌‌‌‌‌ చుట్టూ కేసింగ్‌‌‌‌ నిర్మిస్తున్నారు. బోర్‌‌‌‌‌‌‌‌లోకి మట్టి, ఇసుక చేరకుండా బోర్‌‌‌‌‌‌‌‌ ముఖద్వారం వద్ద జాలీలు పెడుతున్నారు. ఇలా బోర్ల ద్వారా భూమిలోకి నీళ్లు ఇంకేలా చేస్తున్నారు. ఈ బోర్లనే రీచార్జ్షాఫ్టులు అంటారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌‌‌‌ మండలంలో నిర్మించిన రీచార్జ్‌‌‌‌ షాఫ్టులతో గ్రౌండ్ వాటర్ పెరగడంతో, మొత్తం ఇలాంటివి 980 నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 100కు పైగా షాఫ్ట్‌‌‌‌ల నిర్మాణం పూర్తయింది.ఇప్పడు కేంద్రం గుర్తించిన 1593 ప్రాంతాల్లోనూ రీచార్జ్‌‌‌‌ షాఫ్టులు నిర్మించనున్నారు. ఈ బ్లాకులన్నింటిలో రీచార్జ్‌‌‌‌ షాఫ్టులతోపాటు, నీటి కుంటలు, చెరువుల వంటివి అభివృద్ధి చేయనున్నారు. భూగర్భ జలాలకు బదులు వర్షపు నీరు, చెరువులు, కాలువల నీటిని వినియోగించి పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించనున్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జాయింట్ సెక్రటరీ, జాయింట్‌‌‌‌ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న 255 మంది ఆఫీసర్లను నియమించారు. ఒక్కో ఆఫీసర్కు  ఒక్కో జిల్లాలోని బ్లాక్‌‌‌‌లను అప్పగించారు.ఈ బ్లాకుల్లో  గ్రౌండ్ లెవల్లో పనిచేయడానికి ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖల ఆఫీసర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. జులై నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 15 వరకూ ఈ యాక్షన్ ప్లాన్ కొనసాగనుంది. ఈ సమయంలో దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. ఈ వర్షపు నీటితో భూమిని రీచార్జ్ చేయాలన్నదే మిషన్ జల్శక్తి అభియాన్ లక్ష్యం

No comments:

Post a Comment