Breaking News

03/07/2019

ఇంటర్ వివాదంపై కేంద్రం ఆరా


హైద్రాబాద్, జూలై 3, (way2newstv.in)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని టీఆరెస్ ప్రభుత్వ, ఆ పార్టీ నాయకుల తప్పులపై కన్నేసి ఉంచుతోంది. టీఆరెస్‌ని టార్గెట్ చేసే క్రమంలో బీజేపీ ప్రతి అవకాశాన్నీ వాడుకోవాలని చూస్తోంది. కేవలం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే కాకుండా మోదీ మంత్రివర్గంలోని ప్రతి శాఖకు సంబంధించిన మంత్రి కూడా తమతమ శాఖల పరిధిలో టీఆరెస్ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలో టీఆరెస్ ఎమ్మెల్యే సోదరుడు ఫారెస్టు డిపార్టుమెంటుకు చెందిన మహిళా అధికారిపై దారుణంగా దాడికి దిగిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దానిపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. అటవీ శాఖ అధికారిణిపై ప్రజలు దాడి ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. రాజ్యసభలో కర్ణాటకకు చెందిన భాజపా ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలంగాణలో అటవీ అధికారిపై దాడి అంశం ప్రస్తావించారు. దీనిపై జావడేకర్‌ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనల్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాఖ దీనిపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

ఇంటర్ వివాదంపై కేంద్రం ఆరా


తెలంగాణలో జరిగిన ఈ ఘటనను రాజీవ్‌ చంద్రశేఖర్‌ రాజ్యసభలో ప్రస్తావిస్తూ.. రాష్ట్రాల్లో పర్యావరణ చట్టాలు అమలు జరగడంలేదన్నారు. బెంగళూరులో చెరువులు, నీటివనరులు ఆక్రమణకు గురవుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణలో చట్టాలు అమలు కావడంలేదన్నారు. తెలంగాణలో పర్యావరణ చట్టాలను అమలుచేసే క్రమంలో ఎఫ్‌ఆర్‌వో అనితపై దాడిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. చట్టాల అమలులో ఇలాంటి పరిస్థితులు పెద్ద సమస్యగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ఇటీవల కేసీఆర్ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిన ఇంటర్ పరీక్షల వ్యవహారంపైనా కేంద్రం టీఆరెస్ ప్రభుత్వం నుంచి వివరణ కోరేందుకు సిద్ధమవుతోంది. ఇంట‌ర్ బోర్డు వివాదాన్ని ఏదో రకంగా తెర వెనక్కు నెట్టేశామని టీఆరెస్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కేంద్రం దీన్ని తిర‌గ‌దోడాలనుకుంటోంది. దీనిపై ఏకంగా కేంద్ర హోం శాఖ దృష్టి సారించ‌బోతోంది. దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ భాజ‌పా కోర్ క‌మిటీ స‌భ్యులు భేటీ కాగా.. ఈ సందర్భంగా ఇంట‌ర్ బోర్డు వివాదాన్ని అమిత్ షా దృష్టికి రాష్ట్ర నేత‌లు తీసుకెళ్లారు. ఇంట‌ర్ బోర్డు అవ‌క‌త‌వ‌క‌ల‌కి కార‌ణ‌మైన వారిపై ఇంత‌వ‌ర‌కూ సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకోలేద‌నీ, విద్యార్థుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన అంశాన్ని మెల్ల‌గా మ‌రుగున ప‌డేశారంటూ రాష్ట్ర నేత‌లు చెప్పారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ… ఇంట‌ర్ బోర్డు వ్య‌వ‌హారంపై కేంద్రం దృష్టి సారిస్తుంద‌నీ, దీనికి సంబంధించి పూర్తి నివేదిక‌ను త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి కోర‌తామ‌నీ, ఆ త‌రువాత కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది చూద్దామ‌ని అన్నారట.. దీంతో మరోసారి ఇంటర్ వివాదం తెరపైకి వస్తుందన్న భయం టీఆరెస్‌ను వెంటాడుతోంది.

No comments:

Post a Comment