Breaking News

26/07/2019

గ్రామాల్లో వైన్స్ వేలం పాటల

అదిలాబాద్, జూలై 26, (way2newstv.in)
వైన్స్ వ్యాపారులు సిండికేటుగా మారి భారీగా కాసు లు వెనకేసుకుంటున్నారు. పల్లె, పట్టణాలు తేడా లే కుండా పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు వెలిశాయి. గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపుల నిర్వహణ, మద్యంలో నీళ్లు కలిపి ప్రతి బాటిల్‌పై ఎమ్మార్పీకి అమ్ముతున్నారు.ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 158 వైన్సులు ఉండగా.. 22 బార్లు ఉండేవి. జిల్లా పునర్విభజన తర్వాత నూతన ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలు, 243 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. 27 వైన్సులు, 12 బార్లు ప్రస్తుతం ఉన్నా యి. ప్రతి మండలానికో వైన్స్‌షాపును కేటాయించారు. ఈ వైన్స్ షాపుల యజమానులు సిండికెట్‌గా మారారు. గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో వేలం పాటలను చేపట్టి బెల్టుషాపులను ఏర్పాటు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో లక్షలకు పైగా చెల్లించి బెల్టుషాపులను కొనసాగిస్తున్నారు. 
 గ్రామాల్లో వైన్స్  వేలం పాటలు

ప్రతి లిక్కర్ బాటిళ్లలో నీళ్లను పోసి మద్యాన్ని కల్తీ చేస్తూ ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రానికి వస్తే పట్టణానికి సమీపంలోని సుదూరంగా ఉన్న కాలనీల్లో రణదీవేనగర్, గాంధీనగర్, తిర్పెల్లి, శాంతినగర్, క్రాంతినగర్, తాటిగూడ, కేఆర్‌కే కాలనీ, మహాలక్ష్మీవాడ, పిట్టలవాడలతో పాటు పలు కాలనీల్లో ఏ కిరాణ కొట్లలో చూసినా మద్యం బాటిళ్లే దర్శనమిస్తున్నాయి. సమయపాలన లేకుండా ఉదయం నుంచి రాత్రి 12 వరకు తెరిచి మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆకాలనీల్లో నిత్యం గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.గ్రామాల్లో, పట్టణాల్లోని పలు కాలనీల్లో బెల్టు షాపులను ఏర్పాటు చేసి వైన్స్ షాపుల యజమానులే మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఇతర వ్యక్తులు బెల్టుషాపులను ఏర్పాటు చేసుకున్నవారు వైన్స్‌ల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి విక్రయించాల్సి ఉంటుంది. బార్లనుంచి కొనుగోలు చేసి విక్రయిస్తే కేసులు నమోదు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైన్సుల్లో మద్యం కొనుగోలు చేయని వారిపై యజమానులు ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పా టు చేసిన బెల్టు షాపులను తొలగించాలని పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment