Breaking News

26/07/2019

నిబంధనలకు తిలోదకాలు

వరంగల్‌, జూలై 26, (way2newstv.in)
ఎరువుల, పురుగుల మందుల దుకాణాలకు ఇక పై బ్రేక్ పడనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్ణీత విద్యార్హతల్లేని ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాల లైసెన్స్‌లు రద్దుకానున్నాయి. అవగాహన లోపంలో, అధిక లాభార్జన కోసం రైతులకు అవసరం లేకున్నా పురుగుల మందులను, ఎరువులను విక్రయిస్తున్న దందాకు ఇకపై స్వస్థిపలకాలి. దుకాణం నిర్వహించే యజమాని కచ్చితంగా సైన్స్ డిగ్రీ పట్టాదారుడై ఉండాలని ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది నుంచి అమ లు చేయడానికి సిద్ధమైంది. విద్యార్హతల్లేని నిర్వహకులు రైతులకు తప్పుడు మందులు అంటగట్టడంతో రైతులు నష్టపోతున్నారనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వాధికారులకు సైన్స్ డిగ్రీకి చెందిన పట్టాను అందిచకపోతే లైసెన్స్‌లు రద్దు చేయడానికి రగం సిద్ధం చేశారు. 
నిబంధనలకు తిలోదకాలు

జిల్లాలో ఉన్న 399ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపుల నిర్వహకులకు అధికారులు ఇప్పటికే సమాచారాన్ని అందించారు.ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాల నిర్వహకులకు సైన్స్ డిగ్రీ కలిగి ఉండాలని ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వం అమలు చేస్తోంది. సైన్స్ డిగ్రీలో అగ్రికల్చరల్ సైన్స్, బయోకెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, రసాయన శాస్త్రం, జంతుశాస్త్రంలో వంటి విభాగాలుంటాయి. ఈ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనవారు రైతులకు ఎలాంటి ఎరువులు మందులు ఇవ్వాలో ఒక అవగాహన ఉంటుంది. వాటిలో ఏదైన ఒక విభాగంలో తప్పనిసరిగ డిగ్రీ అర్హత ఉంటేనే దుకాణ లైసెన్స్‌లు కొనసాగింపబడుతాయి.ప్రభుత్వం దుకాణాదారునికి తమ విద్యార్హతలను చూపించేందుకు రెండేళ్ల సమయాన్ని విధించింది. ఈ లోపు అవసరమైన విద్యార్హతలు సంపాదిస్తే యథావిధిగా లైసెన్స్‌లు కొన సాగుతుందని, లేకపోతే రద్దు చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో దుకాణాదారులు విద్యార్హుతలున్నవారి కోసం వేట మొదలుపెట్టారు. దుకాణాల్లో పని చేసేందుకైన సైన్స్ డిగ్రీ కోర్సులున్న వ్యక్తులను పెట్టుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చని నిర్వహకులు విద్యావంతుల కోసం అన్వేషిస్తున్నారు.విత్తనాలు, ఎరువులు పురుగుల మందులు విక్రయించే దుకాణాలలో ప్రభుత్వం అనుమతి పొం దిన పురుగుల మందులు, ఎరువులు, విత్తనాలను, మాత్రమే విక్రయించాలి. గతంలో దుకాణాదారుడు నిబంధలను పాటించకుండా వారికి ఎ క్కువ లాభాలు వచ్చే వాటిని విక్రయించడానికి మొగ్గుచూపేవారు. దీంతో నకిలీ మందుల విక్రయాలు పెరిగిపోయాయి. అధికారుల తనిఖీల్లో నూ పలుమార్లు వెల్లడైంది. ఇక నుంచి దుకాణాదారుడు తాను విక్రియించే ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నిల్వలు, ధరలకు సం బంధించిన జాబితాను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల దుకాణాలపై అధికారుల తనిఖీలు పెరిగే అవకాశం ఉన్నందున నకిలీ బెడద తగ్గింది.

No comments:

Post a Comment