Breaking News

26/07/2019

స్టైల్ మారిన టీడీపీ బాస్

విజయవాడ, జూలై 26, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి మూణ్నెల్లు కూడా కాలేదు. అప్పుడే అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్‌ పోరు పీక్స్‌కు చేరంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కొన్నిసార్లు శ్రుతిమించి మరీ... ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యమంత్రి - ప్రతిపక్ష నేత సైతం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో తమ గొంతు వినిపించడానికి అవకాశం రావట్లేదని భావిస్తున్న ప్రతిపక్ష టీడీపీ... కొత్త పంథాను అనుసరిస్తోంది.రోజూ అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే... టీడీపీ సభ్యులంతా మంగళగిరి దగ్గరలోని హ్యాపీ రిసార్ట్‌కు చేరుకుంటున్నారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. రోజుకో అంశాన్ని తీసుకుని తెల్లారి సభలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 
స్టైల్ మారిన టీడీపీ బాస్ 

అంతేకాకుండా చంద్రబాబు రోజూ విలేకర్ల సమావేశంలో తమ వాదన వినిపిస్తున్నారు. తమ వాణిని గట్టిగా వినిపించేందుకు వీడియాలతో సహా ఆధారాలు ప్రదర్శిస్తున్నారు. గతంలో జగన్‌ ఎలాంటి హామీలు ఇచ్చారు... ఇప్పుడు ఎలా మార్చారో వివరిస్తున్నారు. కేవలం 23 మంది సభ్యుల బలంతో అసెంబ్లీలో మైకు కోసం చంద్రబాబు పోరాటం చేయాల్సి వస్తోంది..సభలో సరైన అవకాశం రావడం లేదంటూ... తమ వాదనలను ప్రెస్‌మీట్ల ద్వారా జనానికి వివరిస్తున్నారు. గతంలో ఏ ప్రతిపక్ష నేత కూడా ఇలా చేసిన దాఖలాలు లేవు.చంద్రబాబు శాసనసభ, మండలిలో వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని మొదట్నుంచీ ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ సభ్యులు కూడా అదేస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో రెండు సభల్లోనూ ఉద్రిక్త వాతావరణం తప్పట్లేదు. తక్కువ మంది సభ్యులతో శాసనసభలో అధికార పక్షాన్ని ఢీకొట్టటం చంద్రబాబుకి కొంత ఇబ్బందిగా ఉంది. దీంతో రూట్‌ మార్చిన బాబు... విలేకరుల సమావేశంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. బాబు ఆలోచనపై టీడీపీ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్‌ చేసినా... ప్రజలకు తమ గొంతులు వినిపించకుండా చేయలేరంటూ ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్నారు.

No comments:

Post a Comment