Breaking News

26/07/2019

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్

న్యూఢిల్లీ, జూలై 26,(way2newstv.in)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తేవాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ కోరుతున్నది. కొన్ని స్థానిక, రాష్ట్ర పన్నులనూ జీఎస్టీలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీఎస్టీ మండలికి ఓ మెమోరాండంను అసోచామ్  అందించింది. రెండేండ్లకుపైగా జీఎస్టీలో కాకుండా పెట్రో ఉత్పత్తులపై వేరేగా పన్నులను వసూలు చేశారు. ఇకనైనా జీఎస్టీలో వీటిని కలుపాలి. విడిగా పన్నులు వేయడం వల్ల వ్యాపార నిర్వహణ ప్రభావితం అవుతున్నది అని సదరు మెమోరాండంలో మండలిని అసోచామ్ కోరింది. అలాగే మండీ పన్ను, స్టాంప్ డ్యూటీ, రోడ్ ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్‌లనూ జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేసిం ది. ఇది వ్యాపారాల క్రమబద్ధీకరణకు దోహ దం చేస్తుందన్నది. 
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్

సీజీఎస్టీ, ఐజీఎస్టీ క్రెడిట్ల పునర్వినియోగం, రెస్టారెంట్లు, రియల్టీలకు జీఎస్టీపై వెసులుబాటు అంతర్జాతీయ లావాదేవీలపై పన్ను లెవీపట్ల స్పష్టత, క్రమబద్ధీకరణలనూ మెమోరాండంలో అసోచామ్ ప్రస్తావించింది.విద్యుత్ ఆధారిత వాహనాలపై పన్ను రేట్లను తగ్గించే విషయమై  జరుగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 36వ జీఎస్టీ కౌన్సిల్ భేటీని నిర్వహించాలనుకున్నారు. అయితే పార్లమెంట్‌లో దివాలా చట్టం సవరణల బిల్లుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించాల్సి రావడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాన్ని శనివారం నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా, ఈ-వెహికిల్స్‌పై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలన్న ఒకే ఒక్క ప్రతిపాదనపై జీఎస్టీ మండలి ఈసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సీతారామన్‌కు  లేఖ రాయగా, రాష్ర్టాలు ప్రతిపాదిస్తున్న మరిన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని అందులో సూచించారు. ఈ క్రమంలో సమావేశమే వాయిదా పడింది.

No comments:

Post a Comment