Breaking News

26/06/2019

గ్రామ పంచాయితీల్లో ఆన్ లైన్


నల్లగొండ,  జూన్ 26, (way2newstv.in)
రాష్ట్రవ్యా ప్తంగా గ్రామ పంచాయతీల్లో ఆన్ లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న రికార్డుల విధానానికి స్వస్తి పలకాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్ లైన్ వ్యవస్థ ఉంది. పంచాయతీరాజ్ శాఖలోనూ జవాబుదారీతనం, పారదర్శక త కోసం ఆన్ లై న్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఇటీవల అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గతేడాది కొత్తగా ఏర్పాటైన 4,380 పంచాయతీలు కలిపి మొత్తంగా 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలుఉన్నాయి. ఆన్ లైన్ వ్యవస్థ అమలు చేసేందుకు అన్ని పంచాయతీల్లో సదుపాయాలు లేవు. మొత్తంగా 5,600 చోట్ల కంప్యూటర్లు ఉన్నట్టు పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీలను క్లస్టర్లు గా విభజించారు. రెండు, మూడు చిన్న పంచాయతీలను కలిపి వాటిని ఏర్పాటు చేశారు. 


గ్రామ పంచాయితీల్లో ఆన్ లైన్
ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శులు క్లస్టర్ పరిధిలో కంప్యూటర్ ఉన్న పంచాయతీలకు వెళ్లాలి, లేదా మండల కేం ద్రాలకు వెళ్లి ఆన్ లైన్ రికార్డుల నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.రాష్ట్రంలో ప్రస్తుతమున్న పంచాయతీ కార్యదర్శుల్లో మూడింట రెండొంతుల మంది కొత్త వారే. గత నెలలోనే రాష్ట్రవ్యా ప్తంగా 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు నియమితులయ్యారు. చాలా మందికి గ్రామాల గురించి , కార్యదర్శి విధులు, బాధ్యతల గురించి పెద్దగా తెలియదు. వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోం ది. తాజాగా ఆన్ లైన్ విధానానికి సంబంధించి చాలాచోట్ల డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులతో కార్యదర్శులకు శిక్షణ ఇప్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.రాష్ట్రవ్యా ప్తంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరును అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు వారికి గ్రేడ్ లు ఇస్తున్నారు. కొత్త కార్యదర్శులను ప్రభుత్వం మూడేళ్ల కాం ట్రాక్టు పద్ధతిన నియమిం చింది. ఏటా పనితీరు ఆధారంగా తర్వాతి ఏడాదికి వారిని పొడిగించనున్నారు.ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో మ్యాన్యు వల్ రికార్డుల వ్యవస్థే కొనసాగుతోంది. ఈ ప్రక్రియకు గుడ్ బై చెప్పాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒకేసారి చేయటం సాధ్యం కానందున దశల వారీగా రికార్డులను కంప్యూటర్లలో అప్ లోడ్ చేయాలని, తర్వాత మ్యాన్యు వల్ రికార్డుల ప్రక్రియకు ముగింపు పలకాలని యోచిస్తున్నారు. అయితే పంచాయతీలు అధికంగా ఉండటం, చాలా చోట్ల కార్యదర్శులు కాం ట్రాక్టుపై నియమితులైన వారు కావడంతో ఆన్ లైన్ వ్యవస్థ అమలు సజావుగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

No comments:

Post a Comment