Breaking News

25/06/2019

అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలపై లక్ష రూపాయల జరిమానా

అదనంగా రోజుకు 10 వేల రూపాయల జరిమానా

- డీఈవో గోవిందరాజులు 
నాగర్ కర్నూలు జూన్ 25, (way2newstv.in)
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఎం గోవిందరాజులు కోరారు. మంగళవారం నాగర్ కర్నూలు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల నందు  జరిగిన ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయొద్దని, స్కూల్ బ్యాగులు ఎక్కువ బరువు ఉండకుండా చూడాలని, రికార్డులు సరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 ప్రకారం ప్రవేట్ పాఠశాలల్లో అన్ని వసతులను తప్పనిసరిగా కల్పించాలని డీఈవో గోవిందరాజులు యాజమాన్యాలకు సూచించారు. ఈనిబంధనల అమలు తీరుపై ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.   పాఠశాలల తనిఖీ చేసే   సమయంలో పాఠశాల కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యాజమాన్యాలపై  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలపై లక్ష రూపాయల జరిమానా

జీవో నెం.1 ప్రకారం అమలు చేయాల్సిన నిబంధనలు 
- అన్ని పాఠశాలలో విద్యార్థులకు వసతులను కల్పించాలి.
-ప్రాథమిక పాఠశాలలోని 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు. ఉన్నత పాఠశాలలోని 40మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలన్నారు.
- అన్ని పాఠశాలలో విద్యార్థులు ఫీజుల పెంపుకు సంబంధించి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జిల్లా విద్యాధికారి కార్యాలయానికి సమర్పించిన తరువాతనే ఫీజులు పెంచే విధంగా ఉందని గుర్తు చేశారు. ఫీజులు ఎలా పడితే అలా పెంచకూడదని, పాఠశాల స్థాయి, సౌకర్యాలను బట్టి ఫీజులు పెంచే విధానం జరగాలని కోరారు. పాఠశాల ఆవరణలో పుస్తకాలు అమ్మకూడదని అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- పాఠశాలలకు తప్పనిసరిగా క్రీడా మైదానాలు కల్గి ఉండాలి.
పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను 15శాతం పాఠశాల వసతులకు, 15శాతం పాఠశాల అభివృద్ధికి, 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు ఖర్చు చెల్లించాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న  ఉపాధ్యాయులకు గౌరవ ప్రదమైన జీతాలు అందించాలని యాజమాన్యాలకు సూచించారు.
- పాఠశాలకు గుర్తింపు పొందేటప్పుడు తప్పనిసరిగా తనిఖీ చేసిన తర్వాతనే గుర్తింపు జారీ జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
గుర్తింపులేని పాఠశాలలపై 1 లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని, జరిమానా అనంతరం అలాగే పాఠశాలలను కొనసాగిస్తే రోజుకు పది వేల చొప్పున జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.
- పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించుకోవాలి.
- పాఠశాలలో విద్యార్థినులకు తప్పనిసరిగా టాయిలెట్లు సౌకర్యం కల్పించాలని, పాఠశాలల విద్యార్థుల రవాణా సౌకర్యానికి వినియోగించుకోనున్న పాఠశాల బస్సులను ఫిట్ నెస్ తో పాటు నిష్ణాతులైన డ్రైవర్లను నియమించుకొని పిల్లల్లో రవాణా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా విద్యార్థినిలకు మరియు డ్రైవర్ కు పూర్తి అవగాహన కల్పించాలని డిఇఓ ప్రైవేట్ యాజమాన్యాలకు సూచించారు

No comments:

Post a Comment