Breaking News

26/06/2019

స్కిమ్మింగ్, క్లోనింగ్ లతో దోచేస్తున్నారు


హైద్రాబాద్, జూన్ 26, (way2newstv.in)
క్రెడిట్‌, డెబిట్‌ కార్డులకు సంబంధించి, చాలా మోసాలు బ్యాంకు ప్రతినిధులుగా నమ్మిస్తూ చేసేవే ఉంటున్నాయి. కార్డు దారుడికి సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలు చెప్పి.. నిర్ధారణ కోసం అంటూ మిగతా విషయాలను తెలివిగా అడుగుతారు. కొన్నిసార్లు కార్డు సంఖ్య, సీవీవీలను కార్డును స్వైప్‌ చేసేప్పుడు దొంగలిస్తారు. మీరు సంఖ్యను కొట్టేప్పుడు దాన్ని గుర్తు ప్లాస్టిక్‌ కరెన్సీకి సంబంధించిన డేటా ముష్కరుల చేతికి చేరిన తర్వాత... స్కిమ్మింగ్‌, క్లోనింగ్‌ కార్డులను తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కంప్యూటర్‌, కార్డు రైటర్‌, కార్డు మేకర్‌, మేగెటిక్‌ స్ట్రిప్‌, ఎమ్టీ కార్డులు... ఇవన్నీ ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకుని బోగస్‌ కార్డుల తయారీని 'కుటీర పరిశ్రమలా' స్థాపించేస్తున్నారు. కంప్యూటర్‌ను వినియోగించి తాము సేకరించిన డేటాను కార్డు రైటర్‌ పంపిస్తారు. అక్కడ నుంచి ఎమ్టీ కార్డుల్లో మేగెటిక్‌ స్ట్రిప్‌ ఏర్పాటుచేసి వాటిని రైటర్‌లో పెట్టడం ద్వారా డేటా మొత్తం ఫీడ్‌ చేస్తారు. కార్డు మేకర్‌లో ఉంచి సంబంధిత బ్యాంకు డిజైన్‌తో బోగస్‌ కార్డులు తయారవుతాయి. 

స్కిమ్మింగ్, క్లోనింగ్ లతో దోచేస్తున్నారు

ఇవి అసలు కార్డులకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. ఈ కార్డులతో ముష్కరులు షాపింగ్‌ చేసుకుంటే... బిల్లులు మాత్రం అసలు కార్డు హోల్డర్‌కు వచ్చి చేరతాయి.వీటన్నింటి తర్వాత... ఖాతాదారుడికి ఫోన్‌ చేసి, మీ కార్డు వివరాలు చెప్పి.. మీ దగ్గర్నుంచి 'వన్‌ టైం పాస్‌వర్డ్‌' పుట్టిన తేదీ వివరాలు, ఈ మెయిల్‌ తదితర వివరాలను రాబట్టి, మోసానికి పాల్పడతారు. మరో మోసం ఏమిటంటే.. క్రెడిట్‌ కార్డును క్లోనింగ్‌ లేదా స్కిమ్మింగ్‌ చేయడం. అంటే.. మీ అసలు కార్డు వివరాలతో నకిలీ కార్డును రూపొందిస్తారన్న మాట. ఇలాంటి మోసాలను నివారించేందుకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. 'మ్యాగటిక్‌ స్ట్రిప్‌' స్థానంలో చిప్‌ కార్డులను అందిస్తున్నాయి. పిన్‌ ఆధారంగా పనిచేసే ఈ కార్డుల ద్వారా మోసాలను అరికట్టేందుకు వీలుంది.ఖాతాదారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిన్‌, పాస్‌వర్డ్‌ను ఎవరికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. మొబైల్‌ ఫోన్లలో నమోదు చేసి పెట్టుకోవడం కూడా మంచిది కాదు. జ్ఞాపకం ఉంచుకోవడమే మేలు. అలాగే.. విదేశీ కరెన్సీ, లాటరీల్లో గెలిచారని చెప్పి వచ్చే మెయిళ్లను, ఫోన్లను నమ్మకూడదు. కార్డు పోయినా.. లేదా మీకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసిందని గమనించినా వెంటనే బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయాలి. కార్డు పోయిన సమాచారం బ్యాంకుకు చేరనంత వరకూ.. దానికి సంబంధించిన లావాదేవీలకు కార్డుదారుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, ఖాతాదారుడి తప్పు లేకుండా మోసాలు జరిగినప్పుడు వాటి గురించి ఫిర్యాదు చేయవచ్చు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను అందించేప్పుడు తప్పనిసరిగా ఖాతాదారుడికి మాత్రమే అందించాలి. ఎవరికి వాటిని జారీ చేశారో వారే వాటిని అందుకునేలా ఆధారాలు తీసుకోవాలి. ప్రతి లావాదేవీకీ సంబంధించిన విషయాన్ని ఈమెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ రూపంలో సందేశం పంపించాలి. ఒకవేళ ఖాతాదారులకు ఈ సమాచారం రాకపోతే బ్యాంకులను సంప్రదించాలి.ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా స్కిమ్మింగ్‌ పెరిగిపోయింది. ఈ ముఠాలు షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్స్‌ తదితర ప్రదేశాల్లో ఉండే బార్సును ప్రలోభాలకు లోను చేసిన తమ వైపు తిప్పుకుంటారు. వినియోగదారుడు అక్కడకు వెళ్లిన సందర్భంలో బిల్లు చెల్లించడానికి కార్డులు ఇచ్చినప్పుడు వాటిని స్కిమ్‌ చేస్తారు. దీనికోసం వాడే స్కిమ్మర్‌ అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటాయి. కార్డుని ఒక్కసారి అందులో స్వైప్‌ చేస్తే చాలు... దాని డేటా మొత్తం అందులో నిక్షిప్తమైపోతుంది. అంటే మన కార్డు గుట్టు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. మరోపక్క ఏటీఎం సెంటర్లలో ఫిక్స్‌ చేసే స్కిమ్మర్లూ ఉన్నాయి. వీటిని ఏటీఎం మిషన్‌లో కార్డులను ఇన్‌సర్ట్‌ చేసే ప్రదేశంలో ఫిక్స్‌ చేస్తారు. డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిన వినియోగదారుడు కార్డును ఇన్‌సర్ట్‌ చేయగానే... అక్కడ ఏర్పాటు చేసిన స్కిమ్మర్‌ డేటాను గ్రహిస్తుంది.ఈ విధానంలో వినియోగదారుడు తాను మోసపోయానని గుర్తించడానికీ చాలా కాలం పడుతుంది. క్లోనింగ్‌ చేసే ముఠాలకు కార్డులు అందుబాటులో ఉండాల్సిన పని లేదు. వీరికి ఇంటర్‌నెట్‌ ప్రధాన ఆధారం. బ్యాంకులకు సంబంధించిన వెబ్‌సైట్లు హ్యాక్‌ చేయడం, కొందరు బ్యాంకు సిబ్బందిని ప్రలోభ పెట్టడం ద్వారా అక్కడుండే కార్డు హోల్డర్ల డేటా సేకరిస్తారు. మరోపక్క ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటూ ఎరవేయడం ద్వారా... వినియోగదారుల వివరాలు వెరిఫికేషన్‌ చేస్తున్నామంటూ ఈ-మెయిల్స్‌, ఎస్సెమ్మెస్‌లు పంపించి, పూర్తి సెక్యూర్డ్‌ కాని వెబ్‌సైట్స్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సందర్భంలోనూ కార్డుహోల్డర్ల డేటా తీసుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో పరిచయస్తుల కార్డులకు సంబంధించిన వివరాలను చోరీ చేస్తారు.మీ క్రెడిట్‌ కార్డులు చాలాకాలం పాటు వినియోగించకుండా ఉంటే ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. సంబంధిత అకౌంట్‌ను తాత.వ్కలికంగా నిలుపుదల చేయాలి. ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తే మీరు వినియోగిస్తున్న అడ్రెస్‌ (హెచ్‌టీటీపీ/)తో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. కార్డును పోగొట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంక్‌ టోల్‌ఫ్రీ నెంబరు లేక బ్యాంకుకు ఫోన్‌ చేసి సమాచారం అందించి తక్షణమే బ్లాక్‌ చేయించుకోవాలి.ఫలానా బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని వచ్చే ఫోన్లను నమ్మకండి. మీ ఖాతాకు సంబంధించిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులకు సంబంధించిన వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని పిన్‌ నెంబర్లను చెప్పకండి. మీ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపిన జరిగిన ప్రతి సారి ఆ సమాచారం ఈమెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చేలా చూసుకోండి.

No comments:

Post a Comment