Breaking News

03/06/2019

బల్దియా కమిషనర్ చేతికి భూసేకరణ


హైద్రాబాద్, జూన్ 3, (way2newstv.in)
బల్దియాకు ఇక భూసేకరణ సమస్యలు తీ రనున్నాయి. భూసేకరణ కోసం బల్దియాలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విభాగం ద్వారానే భవిష్యత్ లో భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. కలెక్టర్లతో సంబంధం లేకుండానే నేరుగా భూసేకరణకు మహానగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి)కి ప్రత్యేక అధికారాలు రా నున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఏ దైనా ప్రాజెక్ట్ చేపట్టాలన్నా రోడ్లు నాలాల విస్తరణ జరపాలన్నారెవెన్యూ శాఖ సహకారం తీసుకోవాల్సిన విధంగా ప్రస్తుతం నిబంధనలు ఉన్నా యి. జిల్లా కలెక్టర్ల అనుమతితో ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియను జిహెచ్‌ఎంసి చేపడుతుంది. 625 కి.మీ విస్తరించిన ఉన్న జిహెచ్‌ఎంసిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు వస్తాయి. ఏ జిల్లా పరిధిలో భూసేకరణ జరపాల్సి వస్తే, ఆ జిల్లాకు చెందిన కలెక్టర్ల అనుమతితో ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. దీంతో భూసేకరణ ప్రకియతో జాప్యం జరుగుతోంది. భూసేకరణతో ప్రాజెక్ట్‌ల్లో జాప్యం నెలకొంటుంది. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్ట్‌లతో భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ల కోసం భారీ స్థాయిలోనే భూసేకరణ జరపాల్సి ఉంటుంది. 


బల్దియా కమిషనర్ చేతికి భూసేకరణ
ఈ క్రమంలో భూసేకరణలో జాప్యం నివారించేందుకు జిహెచ్‌ఎంసినే నేరుగా భూ సేకరణ ప్రక్రియ జరిపేందుకు చట్ట సవరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావు అధికారులను ఆదేశించినట్లు తెలిసిం ది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు జిహెచ్‌ఎం సి అధికారులు సిద్ధం చేశారు. రేపోమాపో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని బల్దియా అధికార వర్గాల సమాచారం. ఇక బల్దియాకు భూసేకరణ సమస్యలు తొలగిపోనున్నాయి.ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి ఐపీఎస్ అధికారిని దానికి డైరెక్టర్‌గా నియమించిన తరహాలోనే భూసేకరణకు కూడా ప్రత్యేక విభాగాన్ని కేటాయించి సంయుక్త కలెక్టర్‌ను అదనపు కమిషనర్ హోదాలో నియమించి భూసేకరణ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రతిపాదనలో భాగంగా భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ పోస్టును జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసి సంయుక్త కలెక్టర్, లేక డీఆర్‌ఓ స్థాయి అధికారిని నియమిస్తారు. ఆయన కింద ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను భూసేకరణ అధికారులుగా నియమిస్తారు. ఒక్కొక్కరికి మూడు జోన్ల చొప్పున కేటాయిస్తారు. వీరితోపాటు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లు, చైన్‌మెన్‌లు తదితర 42 మంది సిబ్బందిని నియమిస్తారు. కలెక్టర్ అధికారాలు కమిషనర్‌కు, సంయుక్త కలెక్టర్ అధికారాలు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌కు బదలాయిస్తారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న భూసేకరణ కోసం గ్రేటర్ పరిథిలో ఉన్న నలుగురు జిల్లా కలెక్టర్ల చుట్టూ తిరుగాల్సివస్తున్నది. దీంతో భూసేకరణలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. దీన్ని నివారించేందుకుగాను కలెక్టర్లకు ఉన్న భూసేకరణ అధికారాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు బదలాయించాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు, ప్రభుత్వ ఆమోదముద్ర పడితే కలెక్టర్లకు పంపకుండానే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే భూసేకరణ చేపట్టే వీలు కలుగుతుందని ఓ అధికారి తెలిపారు. ఆయన కమిషనర్ ఆధీనంలో పనిచేస్తారు. భూసేకరణ అధికారాలను బల్దియాకు బదలాయిస్తూ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ వచ్చే ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. చట్ట సవరణ జరిగితే భూసేకరణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్ల వద్దకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది. వివిధ ప్రాజక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించేందుకు పురపాలకశాఖ మంత్రి కే. టీ. రామారావు ఆదేశాల ప్రకారం బల్దియా ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాలాల విస్తరణ, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకంతోపాటు మాస్టర్‌ప్లాన్ అమలు కోసం ఏటా జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున భూసేకరణ చేపడుతున్నది. ప్రస్తుత చట్టం ప్రకారం ఆస్తి విలువను లెక్కించి పరిహారం నిర్ధారించే అధికారం కలెక్టరు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇంటి అనుమతులకోసం రెవెన్యూ శాఖనుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్‌ఓసీ) తీసుకోవాల్సి వస్తున్నది. దీనికోసం నిర్మాణదారులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచినప్పటికీ రెవెన్యూ శాఖ నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకోవాలని టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు కోరుతుండగా, నిర్మాణ దారులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీనికితోడు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఏర్పడుతున్నది. డీపీఎంఎస్ విధానంలో భాగంగా సింగిల్ విండో పద్ధతిలో ఇతర విభాగాల ఎన్‌ఓసీలు కూడా ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఇంకా అది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. రెవెన్యూ రికార్డులు ఆన్‌లైన్‌లో ఉంచడం, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు భూసేకరణ అధికారాలు కల్పించే ప్రతిపాదన ఉండటంతో ఎన్‌ఓసీల అధికారం కూడా బల్దియా కమిషనర్‌కు బదలాయిస్తే ఇండ్ల నిర్మాణదారులు, డెవలపర్లకు ఉపశమనం కలుగుతుందనే అభిప్రాయం పలు వర్గాలనుంచి వ్యక్తమవుతున్నది.

No comments:

Post a Comment