Breaking News

03/06/2019

జగన్ ను నిలబెట్టే... ఆ పది

విజయవాడ, జూన్ 3, (way2newstv.in)
అమరావతి: అమరావతి ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని. చంద్రబాబునాయుడిని కాదని జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారంటే ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, అమరావతిలో భారీ అవినీతి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజధాని ముందడుగుపై సందేహాలు ముసురుకునేలా చేశాయి. దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.ప్రత్యేక హోదా: చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట తప్పి ప్యాకేజీకి ఓకే చెప్పారన్న కోపంతో ప్రజలు జగన్ వైపు చూశారు. జగన్ సీఎం అయితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎన్డీయేలో పూర్తి సంఖ్యాబలం ఉంది.. నాకు చేతనైనంత వరకు మోదీని అడుగుతూనే ఉంటా అంటూ జగన్ బేలగా మాట్లాడడం ప్రజలు జీర్ణించుకోలేరు. హోదా అంటే జగన్ మాత్రమే తేగలరని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.  ఖజానా ఖాళీ: ఆంధ్రప్రదేశ్ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఉద్యోగుల జీతాలు, కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు తప్ప ఇతరత్రా నిధుల్లేని పరిస్థితి. రాష్ట్రం మీద రూ.2.58లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వైఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు అమ్మి నిధులు సమకూర్చుకున్నారు. ప్రస్తుతం జగన్‌కు ఆ అవకాశం కూడా లేదు.సంక్షేమ పథకాలు: జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీలు డబ్బుతో ముడిపడినవే. 45 ఏళ్లకే పెన్షన్, విద్యార్థుల తల్లి ఖాతాలో డబ్బులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ ఖర్చు అంతా ప్రభుత్వం భరించడం, రైతులకు పెట్టుబడి సాయం వంటి నవరత్నాలు అమలు చేయడం జగన్‌కి కత్తి మీద సామే.  

జగన్ ను నిలబెట్టే... ఆ పది 

అభివృద్ధి పనులు: అప్పుల్లో ఉన్న రాష్ట్రం. ఓ వైపు భారీగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మరోవైపు అభివృద్ధి చేయాలి. కంపెనీలు రావాలంటే వారికి ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి. కేవలం సంక్షేమం మాత్రమే చేస్తూ పోతే రాష్ట్రం అథోగతి పాలవుతుంది.  పోలవరం : పోలవరం ఆంధ్రుల జీవనాడి. ఈ ప్రాజెక్టు ఇప్పుడు కేంద్రం చేతిలోకి వెళ్తుందా? రాష్ట్రం చేతిలోకి వస్తుందా? ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే సంశయం ఏపీ రైతుల్లో నెలకొంది. ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ విషయంలో కేంద్రం తీరు రాష్ట్రానికి శాపంగా ఉంది. జగన్ దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కడప స్టీల్ ప్లాంట్: జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. కడప స్టీల్ ప్లాంట్ అనేది కేంద్రం ఇచ్చిన హామీల్లో ఒకటి. 2014 నుంచి 2019 మధ్య ఈ ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. చివర్లో చంద్రబాబు నేనే కట్టేస్తా అంటూ శంకుస్థాపన చేసినా... దాన్ని తలకెత్తుకునేంత పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు. పోనీ ప్రైవేట్ కంపెనీలకు అప్పజెబితే అది పెద్ద రాద్ధాంతం అవుతుంది. జగన్ సొంత జిల్లా ఇష్యూ అయిన కడప స్టీల్ ప్లాంట్ కూడా ఆయన ఫేస్ చేయబోయే ప్రధాన ఛాలెంజ్‌ల్లో ఒకటి. సీఎంగా కోర్టుకు హాజరవడం: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. సీఎం హోదాలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారంటే, జగన్ మోహన్ రెడ్డికే కాదు, రాష్ట్రంలోని అందరికీ కొంచెం ఇబ్బందే. ప్రజలకు ఇవేవీ తెలియనివి కావు. అయినా, ఓటేశారంటే జగన్ మీద నమ్మకం. ఇప్పుడు జగన్ సీఎం కాబట్టి, ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉండొచ్చు. కేంద్రం నుంచి నిధులు తేవడం : కేంద్రంలో ఫుల్ మెజారిటీ ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో దోస్తీ చేసిన వారికి ఎక్కువ, శత్రుత్వం పెంచుకున్న వారికి తక్కువ నిధులు వస్తాయనే భావన ప్రజల్లో ఉంది. అయితే, ఏపీ నుంచి బీజేపీకి ఎలాంటి రాజకీయ లబ్ది లేనప్పుడు రాష్ట్రానికి ఉదారంగా నిధులు కేటాయిస్తుందా అనేది సందేహమే. కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించి నిధులు రాబట్టడం జగన్ ముందున్న అన్నిటికంటే పెద్ద సవాల్.అవినీతి రహిత పాలన: రాష్ట్రంలో అవినీతిరహిత పాలన తెస్తానని జగన్ ప్రతిజ్ఞ చేశారు. అందుకోసం జ్యుడీషియల్ కమిటీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వంలో అవినీతి అంటే పాలకులు ఒక్కరే కాదు. నేతలు, అధికారులు.. ఇలా రకరకాల మార్గాల్లో ఉంటుంది. మా ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే అవినీతి చేయలేదని చెప్పుకోవచ్చు. కానీ, కిందిస్థాయిలో ఉన్న అవినీతిని అంతం చేయడం అనేది అసాధ్యం. జగన్ చెబుతున్న అవినీతి రహిత పాలనలో అది కూడా అంతం అయితే, మరో 30 ఏళ్లు ఆయనే సీఎం కావడం మాత్రం ఖాయం.  

No comments:

Post a Comment