Breaking News

03/06/2019

కరువుతో విలవిలలాడుతున్న ప్రకాశం


ఒంగోలు, జూన్ 3, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తీవ్రమైన కరవుతో విలవిలలాడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ జిల్లాకు అత్యంత కరవు ప్రాంతమనే పేరుంది.ఏప్రిల్ నెలలో ప్రకాశం జిల్లాలో కేంద్ర కరవు పరిశీలన బృందం పర్యటించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఇంత కరవును ఎప్పుడూ చూడలేదని.. తమకు ఎడారిలో ఉన్నట్లుగా అనిపిస్తోందని బృందంలోని అధికారులు ఆశ్చర్యపోయారు.ప్రకాశం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మెుత్తం 56 మండలాలున్నాయి. అందులో ఒక్క చీరాల మండలం మినహా మిగతా 55 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. మార్కాపురం , కందుకూరు డివిజన్లలోని బెస్తవారిపేట, సి.ఎస్.పురం మండలాల్లో కరవు అధికంగా ఉంది. జిల్లాలోని పలు కరవు ప్రభావిత ప్రాంతాల్లో బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుంది.


కరువుతో విలవిలలాడుతున్న ప్రకాశం
ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నాలుగేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు పడక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, బావులు, బోర్లు ఎండిపోయాయి. జిల్లాలోని చారిత్రక కంభం చెరువు అడుగంటిందిపశువులకు మేత లేదు. తాగేందుకు నీరులేదు. పశువులే కాదు మనుషులూ తాగునీటి కోసం అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో ఎటుచూసినా కరవు పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. పంటలు పండక, దిగుబడి లేక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు.ఇక్కడి రైతులు ప్రధానంగా కంది, శనగ, పొగాకు, మిర్చి, వరి పంటలు పండిస్తారు. వీటితోపాటు బత్తాయి తోటలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో దాదాపు అన్ని పంటలూ దెబ్బతిన్నాయి.బేస్తవారిపేటలో ఈ ఏడాది నీటి సమస్య మరీ ఎక్కువగా ఉందని కొందరు మహిళలు చెప్పారు. కుళాయిలకు సరిగా నీళ్లు రాకపోవటంతో అందరూ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారని.. వీధిలోకి ట్యాంకర్ రాగానే పోట్లాడి మరీ నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.కరవు బృందానికి కంభం చెరువుతోపాటు, తీవ్ర కరవు ప్రభావిత ప్రాంతాలను చూపించి పరిస్థితిని వివరించినట్లు ప్రకాశం జిల్లా ఆర్డీఓ తెలియజేశారు.తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నీళ్లు పడేచోట బోర్లను వేయటంతోపాటు ట్యాంకర్ల సంఖ్యను కూడా పెంచాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment