Breaking News

03/06/2019

జిల్లాల్లో పూర్తయిన 70 శాతం సరఫరా


విజయవాడ, జూన్ 3, (way2newstv.in)
పాఠ్య పుస్తకాల పంపిణీలో జిల్లా పురోగతి సాధిస్తోంది. తొలి విడతగా జిల్లాకు 70 శాతం మేరే పాఠ్య పుస్తకాలు వచ్చాయి. 61.12 శాతం మేర పాఠ్య పుస్తకాలను ఆయా పాఠశాలలకు తరలించారు. దీంతో పాఠ్య పుస్తకాల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిచింది. జిల్లాకు మొత్తం 15లక్షల 13వేల 8 పాఠ్య పుస్తకాలు రావల్సి ఉంది. ఇందులో తొలి విడతగా 70 శాతం మేర 12లక్షల 33వేల 947 పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటన్నింటినీ విజయవాడలోని డిపో నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా మండల విద్యా శాఖాధికారి కార్యాలయాలకు తరలించారు. మండల విద్యా శాఖాధికారి కార్యాలయాల నుండి పాఠశాలలకు పుస్తకాల పంపిణీ ప్రస్తుతం జరుగుతోంది. 


జిల్లాల్లో పూర్తయిన 70 శాతం సరఫరా
శనివారం నాటికి 61.12 శాతం మేర అంటే 6లక్షల 48వేల 572 పుస్తకాలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందచేశారు. మరో రెండు రోజుల్లో పెండింగ్‌లో ఉన్న 30 శాతం మేర పాఠ్య పుస్తకాలు కూడా జిల్లాకు రానున్నాయని విద్యా శాఖాధికారులు తెలిపారు. జూన్ 5వతేదీ నాటికి నూరు శాతం పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి  తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలతో పాటు చిన్న చిన్న మరమ్మతులు ఉన్నా వాటన్నింటినీ సరి చూసుకోవాలని హెచ్‌ఎంలకు సూచించామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల రెన్యువల్ విషయంలో నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలపై మూసి వేస్తామని డీఇఓ రాజ్యలక్ష్మి హెచ్చరించారు.

No comments:

Post a Comment