సి సి కెమెరాల తో గ్రామానికి భద్రత.. ప్రజలకు భరోసా...
- 100శాతం సిసి కెమెరాలు ఉన్న నియోజకవర్గంగా ఆదర్శంగా నిలుద్దాం..
- మాటిండ్ల గ్రామములో సిసి కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్ రావు
చిన్నకోడూరు, జూన్ 18 (way2newstv.in)
సిసి కెమెరాల ఏర్పాటు తో గ్రామానికి భద్రత నిస్తూ..ప్రజలకు భరోసానిస్తున్నాం అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో నారాయణ రావు పేట మండలం మాటిండ్ల గ్రామంలో ఏర్పాటు సిసి కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన నారాయణ రావు పేట మండలంలో మాటిండ్ల గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనియమన్నారు.
సేఫ్ విలేజ్..
గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం లో సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు.. దొంగల బెడద , గ్రామాల్లో దొంగ తనాలు అరికట్టి గ్రామానికి భద్రత , ప్రజలు ఒక భరోసా కల్పిస్తున్నామని అన్నారు..నారాయణ రావు పేట మండలం లో అన్ని గ్రామాలు, సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి 100% సిసి కెమెరాలు ఉన్న నియోజకవర్గంగా ఆదర్శంగా నిలుద్దామని చెప్పారు. ఇందుకు ప్రజాప్రతినిధులు , గ్రామాల్లో ఉండే నాయకులు, యువకులు ప్రత్యేక చొరవ చూపి సేఫ్ విలేజ్ గా చేసుకుందాం అని చెప్పారు.
No comments:
Post a Comment