Breaking News

19/06/2019

ముగ్గురు సీఎంల వారసుల అసెంబ్లీ


అమరావతి, జూన్ 19 (way2newstv.in)
ఇది నిజంగా అరుదైన రాజకీయ చిత్రమే. అసెంబ్లీలో ముఖ్యమంత్రులుగా చేసిన వారి వారసులు ఉండడం సహజం. అయితే వారు ఏ స్థాయిలో అక్కడ వెలిగిపోతున్నారన్న‌దే ఇపుడు చర్చ. ఏపీ అసెంబ్లీ తీరు చూస్తే ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు అన్నది అందరికీ తెలిసిందే. తండ్రి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ లేని వ్యవహారం. దాన్ని నిజం చేసి రుజువు చేసిన రాజకీయ నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు. ఓ విధంగా జగన్ చరిత్ర స్రుష్టించారనే చెప్పాలి. తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకు అదే పార్టీలో కొనసాగి ముఖ్యమంత్రి అయిన చరిత్ర దేశంలో కొన్ని చోట్ల ఉంది, కానీ తండ్రి పార్టీని మూడు నెలల రాజకీయ అనుభవంతోనే విడిచిపెట్టేసి కొత్తగా పార్టీ పెట్టుకుని ఆ తండ్రి రాజకీయాన్ని ముందుకు తీసుకురావడం, 


ముగ్గురు సీఎంల వారసుల అసెంబ్లీ
అదే ముఖ్యమంత్రి పీఠంలో కుదురుకోవడం అన్నది జగన్ ఒక్కడికే సాధ్యమైందనుకోవాలి.ఇక ఏపీ కొత్త సభలో మరో ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడ ఘనమైన చరిత్ర కలిగిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడే. అన్న నందమూరి తారకరామారావు తనయుడు బాలక్రిష్ణ ఇదే సభలో ప్రతిపక్ష సభ్యుడు. బాలయ్య గత అయిదేళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. తేడా ఏంటి అంటే అపుడు అధికార పార్టీ సభ్యుడు. ఇపుడు ప్రతిపక్ష సభ్యుడు. అంతే తేడా. నాడు గెలిచిన తరువాత కనీసం చంద్రబాబు బాలయ్యని మంత్రిని కూడా చేయలేదు. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ కీలకమైన ఏ బాధ్యతా కూడా అప్పగించలేదు. ఇక విపక్షలోకి వచ్చాక కూడా బాలయ్య వట్టి సభ్యుడు మాత్రమే. కనీసం పార్టీ ఉప నేత కూడా కాదు. అటు జగన్, ఇటు బాలయ్యలను చూస్తే ఇది నిజంగా భారీ తేడాగానే కనిపిస్తుంది.ఇక శాసన మండలికి వెళ్తే అక్కడ మాజీ ముఖ్యమంత్రి వారసుడిగా నారా లోకేష్ ఉన్నారు. ఆయన గత సభలో మంత్రిగా పనిచేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శిగా పార్టీలో అతి ముఖ్యునిగా ఉన్నారు. ఆయన తాజా ఎన్నికల్లో మంగళిగిరిలో ఓడిపోయారు. ఇక ఈ పదవులు అన్నీ కూడా తండ్రి చంద్రబాబు చాటు బిడ్డగానే లోకేష్ కి లభించినవి. మరి అక్కడకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళ్ళినపుడు ఆ తేడా కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

No comments:

Post a Comment