Breaking News

05/06/2019

జగన్ కు చంద్రబాబు లేఖ


విజయవాడ. జూన్ 5 (way2newstv.in):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణ కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధంగా గుర్తించాలని వినతి చేశారు. పార్టీ అధినేతగా తనను కలిసేందుకు అనేకమంది వస్తుంటారని అందువల్ల ఈ భవనాన్ని తమకే కేటాయించాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.కాగా.. బుధవారం ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశం జరిపారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు. 


జగన్ కు చంద్రబాబు లేఖ
ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రజావేదిక భవనం గురించి చర్చించి వైఎస్ జగన్‌కు లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖపై సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.కన్నా ఆరు లేఖలు ఏపీ సీఎం జగన్‌కి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ 7 లేఖలు రాశారు. ఆ లేఖల్లో.. రాజధాని భూముల అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోలులో.. అక్రమాలపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయాలని కోరారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేలా కొత్త పాలసీ తేవాలని సూచించారు.పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నిర్వాసితులకు న్యాయం చేయాలని కన్నా డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన.. హిందూ దేవాలయాలను పునర్మించాలని జగన్‌కు కన్నా కోరారు. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవాలయ భూముల పరిరక్షణ కోసం.. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో మార్పులు తేవాలని కన్నా లేఖలో కోరారు.

No comments:

Post a Comment