Breaking News

08/06/2019

అరకు కాఫీకి ఇంటర్నేషనల్ డిమాండ్


విశాఖపట్టణం, జూన్ 8, (way2newstv.in)
అద్భుతమైన రుచి, ప్రత్యేక అనుభూతిని పొందే అరకు కాఫీ ఇక నుంచి ఇన్‌స్టంట్ కాఫీ తరహాలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళ్ళనుంది. ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. డెహ్రాడూన్, రాంచీ, హైదరాబాద్, జయపూర్ నుంచి దాదాపు రెండు కోట్ల మేర ఇన్‌స్టంట్ కాఫీని కోరుతూ ఆర్డర్లు వచ్చాయి. దీంతో వీటిని సరఫరా చేసేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఏర్పాట్లు చేస్తోంది. ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలెప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫైడ్) రీజనల్ కార్యాలయాల నుంచి వచ్చిన ఆర్డర్లు దాదాపు రెండు కోట్ల మేర ఉన్నాయి. ఇవి కాకుండా పలు రాష్ట్రాల నుంచి ఇన్‌స్టంట్ కాఫీ కోరుతూ ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో వీటి ద్వారా ఆదాయ లక్ష్యాలను పెంచుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇన్‌స్టంట్ కాఫీకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో దేశీయ మార్కెట్‌తోపాటు ఇక నుంచి ప్రపంచ దేశాల్లో విక్రయాలు పెంచుకోవాలని నిర్ణయించిన యాజమాన్యం అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 


అరకు కాఫీకి ఇంటర్నేషనల్ డిమాండ్
అరకు వ్యాలీ కాఫీ (ప్యూర్ ఇన్‌స్టంట్) పేరిట మార్కెట్‌లోకి విడుదల చేసే చిన్నపాటి డబ్బాను రూ.85లు, రూ.160ల క్యాటగిరీల కింద విభజించి విక్రయిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో అరకు వేలీ, ముంచింగ్‌పుట్, పాడేరు, చింతపల్లి, గూడెం కొత్తవీధి, పెదబయలు, తాజంగి, ఏజెన్సీ అన్నవరం తదితర ప్రాంతాల్లో విరివిగా పండే కాఫీ గింజలను గిరిజన రైతుల నుంచి సేకరిస్తున్నారు. పండ్లను సేకరించి వీటిని నిర్దేశించిన సమయంలో ఎండబెట్టిన తరువాత కనీస బరువుకు చేరుకున్న తదుపరి యంత్రాల ద్వారా కాఫీ పిక్క రూపంలో అందుబాటులోకి వస్తుంది. అపుడు దీనిని ఫౌడర్‌గా మారుస్తారు. ఈ విధంగా మారే ఫౌడర్‌ను వివిధ కేటగిరిలుగా విభజించి ప్యాకెట్ల తరహాలో 250 గ్రాములు, 500గ్రాములు, కిలో డబ్బాలు, ప్యాకెట్ల తరహాలో అందుబాటులోకి తీసుకొస్తారు. గత మూడేళ్ళకాలంగా కాఫీ గింజల సేకరణతోపాటు అరకు కాఫీని ప్రత్యేక ప్యాకెట్లగా తయారు చేసి దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసిన జీసీసీ యాజమాన్యం ఆర్థికపరమైన లక్ష్యాలను సాధించింది.ఏపీ, తెలంగాణా, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు అరకు కాఫీ సరఫరా చేస్తున్నారు. పంపిణీదారులు, జీసీసీ ద్వారా వెళ్తున్న అరకు కాఫీ రుచి ఇపుడు మిగిలిన రాష్ట్రాలు చూసేందుకు ముందుకొస్తున్నాయి. ఇటీవల మంచి డిమాండ్ పలుకుతున్న అరకు వ్యాలీ కాఫీని కాస్తంత మెరుగుపర్చి ఆకర్షణీయంగా చిన్నపాటి డబ్బాలో వేసి మరీ ఇన్‌స్టంట్ కాఫీగా అందరికీ అందుబాటులోకి ఉండే విధంగా విక్రయిస్తున్నారు. దీంతో ఇపుడు దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఇన్‌స్టంట్ కాఫీకి విశేష ఆదరణ లభిస్తోంది. ఆయా దేశాలకు సంబంధించి ట్రైఫైడ్ రీజనల్ కార్యాలయాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇందులోభాగంగా ఇప్పటికే దాదాపు రెండు కోట్ల మేర ఆర్డర్లు సిద్ధంగా ఉండగా మరికొన్ని దేశాల నుంచి వచ్చే ఆర్డర్లకు తగినట్టుగా ఇన్‌స్టంట్ కాఫీని అందుబాటులో ఉంచుకోవాలని జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ జీ.బాబూరావునాయు  తెలియజేశారు. గత నాలుగేళ్ల నుంచి అరకు వేలీ కాఫీ విక్రయాలు జరుగుతున్నాయి. ఇపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విక్రయాలు పెంచుకునే క్రమంలో పలు సంస్థలతో లావాదేవీలు పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చింతూరు కారం పొడిని జీసీసీ బ్రాండ్‌తో అందుబాటులోకి తీసుకురాగా, దీనికీ డిమాండ్ పెరిగిందన్నారు.

No comments:

Post a Comment