Breaking News

06/06/2019

ఇంకా ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు


హైద్రాబాద్, జూన్ 6 (way2newstv.in)

జూన్ 1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా తాకనున్నట్లు అంచనా వేశారు.మొదట అంచనా వేసిన దానికంటే మరో రెండు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ  వెల్లడించింది.మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం చూస్తోన్న ప్రజలకు, తొలకరి చినుకుల కోసం ఎదురుచూస్తోన్న రైతన్నలకు నిరాశ తప్పేలా లేదు. నైరుతి రుతుపవనాలు మరో వారం రోజులు ఆలస్యం కావడమే దీనికి కారణం. మొదట అనుకున్న తేదీ కంటే మరో వారం రోజులు రుతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకనున్నట్లు మొదట ఐఎండీ ప్రకటించింది. 


ఇంకా ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు
అయితే, వీటి రాక ఐదు రోజులు ఆలస్యమవుతుందని ఆ మధ్య ఐఎండీ వెల్లడించింది. ఇప్పుడు మరో రెండు రోజులు ఆలస్యంగా వస్తున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళను తాకనున్నట్లు ఐఎండీ తాజాగా తెలిపింది. ఇక 13న దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. రెండు రోజులు అటూ ఇటూగా కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోకి ఈనెల 11న ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నిజానికి 6వ తేదీనే నైరుతి రుతుపవనాలు వస్తాయని, 11న తెలంగాణకు రావొచ్చని.. జూన్‌-సెప్టెంబరు నడుమ దీర్ఘకాల సగటుతో పోలిస్తే 96 శాతం మేర సాధారణ వర్షాలు పడతాయని ఐఎండీ కొద్దిరోజుల క్రితం అంచనా వేసింది. కానీ, అనుకున్న దానికంటే మరో రెండు ఆలస్యంగా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది.రుతుపవనాలు రాక, ఇంకా వానలు పడకపోవడంతో ఖరీఫ్‌ నాట్లు ఆలస్యమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతు పవనాలు కిందటేడాది కూడా ఆలస్యంగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2018లో జూన్‌ 8న, 2017లో జూన్‌ 12న తెలంగాణలోకి ప్రవేశించాయి. 2016 లో జూన్‌ 17న, 2015లో జూన్‌ 13న, 2014లో జూన్‌ 19న రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకాయి. గతేడాది ఇదే సీజన్‌లో 97 శాతం వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అందుకు భిన్నంగా 92 శాతం వర్షపాతమే రాష్ట్రంలో నమోదైంది. 

No comments:

Post a Comment