Breaking News

06/06/2019

దవాఖానాల్లో దోచేస్తున్న సెక్యూరిటీలు


హైద్రాబాద్, జూన్ 6, (way2newstv.in)
పకనభుత్వాస్పత్రుల్లో ప్రైవేట్ సెక్యూరిటీ, కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం కొనసాగుతోంది. అడ్డగోలు దందాకు తెగబడుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో డీఎంఈ రమేష్ రెడ్డి స్వయంగా దీనిపై దృష్టి పెట్టారు. మూడు రోజుల క్రితమే హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పేషెంట్ల దగ్గర వసూళ్లకు పాల్పడిన సంఘటనలను సాక్ష్యాలతో సహా ఉన్నతాధికారులకు అందించారు. ఈ సంఘటనను తీవ్రంగా తీసుకున్న డీఎంఈ రమేష్ రెడ్డి ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరో ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. దీంతో వసూళ్ల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే వసూళ్ల పర్వం చాలా రోజుల నుంచే నడుస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్ సిబ్బంది, కాంట్రాక్ట్ సెక్యూరిటీ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ప్రతి పెద్దాస్పత్రి వద్ద దాదాపు 50 నుంచి -వంద మందికి పైగా ఉద్యోగులు ఉంటున్నారు. వీరికి జీతం కాస్త తక్కువ కావటంతో హాస్పిటల్స్ లో పేషెంట్ల వద్ద వసూళ్లు ప్రారంభించారు. మొదట్లో గర్భిణులు, వారి బంధువులు పిల్లలు -పుట్టిన సంతోషంలో వీరి సేవలకు ఎంతో కొంత ఇచ్చేవారు. ఇది కాస్త ప్రసవం అయిన ప్రతి గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు తీసుకునే స్థాయికి చేరింది. 


దవాఖానాల్లో దోచేస్తున్న సెక్యూరిటీలు

దీంతో చాలా -రోజలుగా పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగా చర్యలు తీసుకొని ఇది మామూలే అన్నట్లుగా వైద్యాధికారులు పట్టించుకోకపోవటంతో ప్రైవేట్ సిబ్బంది ఆగడాలు శృతి మించుతున్నాయి.ప్రభుత్వాస్పత్రుల్లో డెలవరీ పేషెంట్ల దగ్గర రేట్లు ఫిక్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేట్ల బురుజు, నిలోఫర్, కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో చాలా రోజుల నుంచే ఈ వసూళ్లు కొనసాగుతున్నాయి. పిల్లలు పుట్టారన్న సంతోషంలో చాలా మంది సహాయక సిబ్బంది అడగక ముందే ఎంతో కొంత ఇస్తున్నారు. అయితే దీంతో వారు సంతృప్తి చెందటం లేదు. ఆడపిల్ల ఐతే దాదాపు రూ.1500, మగబిడ్డ ఐతే రూ.2 వేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కోఠిలోని మెటర్నిటీ హాస్పిటల్లో పలుమార్లు వసూళ్లపై సూపరింటెండెంట్ కు గర్భిణుల బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ సీసీ కెమెరాలు లేనిచోట వసూలు చేస్తున్నారని తెలియటంతో హాస్పిటల్లో మరో 16 చోట్ల కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిలోఫర్ హాస్పిటల్ లో వసూళ్ల దందాను తట్టుకోలేక రెండు నెలల క్రితం పేషెంట్బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఏదైనా ఘటన జరిగిందంటే రెండు నుంచి మూడు రోజుల పాటు వసూళ్లు ఆపేసి తిరిగి డబ్బులు డిమాండ్ చేయటం మొదలు పెడుతున్నారు సిబ్బంది.ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రసవం చేయించే స్థోమత లేని వారు ప్రభుత్వాస్పత్రుల్లో జాయిన్ అవుతున్నారు. ఇలాంటి వారు బిడ్డ పుడితే రూ.1500 నుంచి రూ.2 వేలు ఇచ్చుకోలేని పరిస్థితి. పేషెంట్ ఆర్థిక పరిస్థితిని వీరు ఏమాత్రం పట్టించుకోరు. ఎంతో కొంత ఇచ్చినా అలాంటి వారిని చిన్నచూపు చూస్తారు. చీదరింపులు, సూటిపోటి మాటలు అంటున్నారు. బంధువులు పరామర్మించేందుకు వస్తే దురుసుగా ప్రవర్తిస్తారు. ఎవరికి చెప్పుకోవాలే తెలియక బాధపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. హాస్పిటల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వీరికే వంత పాడటంతో చాలా మంది అడిగినంత డబ్బులు ముట్టజెబుతున్నారు.

No comments:

Post a Comment