Breaking News

08/06/2019

కొలువు ఒక చోట... కుటుంబం మరో చోట


నిజామాబాద్, జూన్ 8, (way2newstv.in)
రూల్స్ ప్రకారం కుటుంబ సభ్యులతో హెడ్‌క్వార్టర్లతో ఉండవలసిన అధికారులు, కామారెడ్డి, నిజమాబాద్, హైదరాబాద్ నుండి రాకపోకలు సాగిస్తున్నారు.  అత్యవసర సర్వీస్‌రంగమైన విధ్యుత్‌శాఖలో సిబ్బంది అందుబాటులో లేక పోవడం, సమయపాలన పాటించకపోవడం శాపంగా మారింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో 20కోట్ల రూపాయలతో చేపట్టిన హెచ్‌విడిఎస్ పథకం పనులు నాణ్యతాలోపంతో అద్వాన్నంగా చేపట్టారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. నిర్మాణ విభాగం అధికారులు సివిల్‌పనుల్లో నాణ్యతా లేకున్నా బిల్స్ పాస్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.ఆఫీసులో ఎఇలు, లైన్ ఇన్స్‌పెక్టర్లు క్రిందిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నా యి. భారీగా వేతనాలు, ప్రమోషన్లు పొందిన విద్యుత్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో కనిపించడంలేదని, ఫోన్లు లేపడం లేదని, ఫోన్లు బందుపెట్టుతున్నారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిల్లో విద్యుత్ సిబ్బంది సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కామారెడ్డి, దోమకొండ, బిక్కనూర్ మాచారెడ్డి, బీబీపేట ప్రాంతా ల్లో ఎఇలు విధులను పూర్తిగా నిర్లక్షం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దోమకొండ, బీబీపేట, బిక్కనూరు ఎఇలు 10 ఏళ్ళకు పైగా పాతుకుపోయి సరైన సేవలు అందించకుండా అలసత్వం వహిస్తున్నార ని ఫిర్యాదులు వస్తున్నాయి. 


కొలువు ఒక చోట... కుటుంబం మరో చోట
కొందరు ఎఇలు స్థానచలనం లేకపోవడం తో రాజకీయాలు, వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. 3 ఏళ్లకు బదిలీ జరగాల్సిన 12 నుంచి 15 ఏళ్లుగా ఆఫీసుల్లో పాతుకుపోయారు. ఉన్న తాధికారులను తప్పుదోవపట్టిస్తూ రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని అనేకం ఫిర్యాదులు వస్తున్నాయి. బీబీపేట, దోమకొం డ, బిక్కనూరు సబ్‌స్టేషన్ల పరిధిలో అనుమతులు లేని ట్రాన్స్‌ఫార్మర్ల దందాను కొనసాగిస్తూ, లక్షల రూపాయలకు ట్రాన్స్‌ఫార్మర్లను విక్రయిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు నడుస్తాయి కాని విధ్యుత్ శాఖలో వాటికి అనుమతి ఉండదు. దీనితో లోడు సమస్యకూడ ఎదురవుతుంది. ఒక్కోట్రాన్స్‌ఫార్మర్‌ను ఎఇ క్రింది స్థాయి సిబ్బంది 60 వేలకు ఒకటి చొప్పున అమ్ముకొని అనుమతుల్లేని ట్రాన్స్‌ఫార్మర్ల దందాను కొనసాగిస్తున్నారు. హెడ్ క్వార్టర్‌లో ఉండకపోవడం రైతులను, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎఇలు, లైన్ ఇన్స్‌పెక్టర్లు సమయపాలన పాటించడం లేదని పిర్యాదులు వస్తున్నాయి. పనులను రేపు మాపు అంటూ సాగదీస్తున్నారని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, కొత్త లైన్ల ఏర్పాటు స్థంబాలు వేయడంలో విధ్యుత్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, నాన్యత లేని విధ్యుత్ సామాగ్రిని రైతులచేత కొనిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ పరికరాలు ట్రాన్స్‌కో సరఫరా చేసిన వాటిని బిగించకుండా రైతులచేత కొనిపిస్తున్నారని ఎఇల పైన ఆరోపణలు వస్తున్నాయి. విధ్యుత్ చోరి కేసులు అధిక శాతం ఎస్సీ, ఎస్టీలపైన పెడుతున్నారని, మిల్లర్లు, వ్యాపారులు, ఇటుకబట్టి వ్యాపారుల జోలికి ఆరోపణలు వస్తున్నాయి. ఎఇలకు పిర్యాదులు వస్తున్నాయి. తరుచూ కరెంటు పోవడం లైన్ల నిర్వాహణ లోపాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఆధరా బాదర హెచ్‌విడిఎస్ పనులతో క్షేత్రస్థాయిలో తీవ్రంగా నష్టపోతున్నారు.పరిశ్రమలకు, మిల్లర్లకు, ఇటుక బట్టీలకు గృహమీటర్లను అమర్చడంతో అవినీతి అక్రమాలు తెరతీస్తున్నాయి. ఎఇలు, లైన్‌ఇన్స్‌పెక్టర్లపై, ఉన్నతాధికారుల పర్యావేక్షణ లేకపోవడం కరెంటు శాఖలో ఇష్టారాజ్యంగా నడుస్తుంది. అధికారులకు ఇటీవల కల్పించిన ప్రమోషన్లతో ఇష్టమున్నట్లు కొత్త ఆఫీసులు నెలకొల్పుతు అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment