Breaking News

08/06/2019

పట్టి ముంచుతున్న నకిలీలు


నల్గొండ, జూన్ 8, (way2newstv.in)
వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులను నిలువునా ముంచేందుకు మార్కెట్‌లో నకిలీ విత్తనాలు వచ్చి పడుతున్నాయ్.. అయితే విత్తనాల ఎంపికలో తగిన సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో ఏ రైతు భూమికి, ఏ పంట రకం విత్తనం అవసరమో చెప్పడం లేదు. రైతుల అమాయకత్వం, విత్తనాలపై అవగాహనలేమిని దళారులు ఆసరాగా తీసుకుని నిలువునా ముంచుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం వరకు వచ్చే ఏడాది విత్తడానికి రైతులు ఈ ఏడాది పండిన పంటల నుంచే ఎంచుకుని దాచుకునేవారు. తమలో తాము పంచుకునేవారు. మంచి విత్తనాలను గుర్తించి మెరుగైన రకాలను పునరుత్పత్తి చేసేవారు. అధిక దిగుబడి వంగడాలకు ప్రోత్సాహం, సంస్కరణల పేరిట కేంద్రం రైతు చేతిలోని విత్తనాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రైతుసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. 


పట్టి ముంచుతున్న నకిలీలు

విత్తనం అంటేనే ప్రైవేట్ అనేలా దాపురించిందంటున్నారు. గతంలో పత్తి కంపెనీల ప్రకటనలకు భిన్నంగా మొక్కలు సరిగా పెరగక, చీడ పురుగులకు గురై రైతులు నష్టపోయారని చెబుతున్నారు. చెప్పిన దిగుబడిలో సగం కూడా రాలేదని, పైగా మార్కెట్లో తగిన ధరలు రాక మరింతగా నష్టానికి గురయ్యారని రైతు సంఘం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.  ఏది నాసిరకమో, ఏదీ మేలు రకమో తెలియని స్థితిలో విత్తనాలు కొనుగోలు చేస్తుండటంతో ఏటా కోట్ల రూపాయల్లో రైతులకు నష్టం వాటిల్లుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రాన్ని తొలకరి పలకరిస్తుందన్న వాతావరణ శాఖ సమాచారంతో దుక్కులు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా రైతుబంధు పేరిట ఎకరాకు రూ.4వేలు పెట్టుబడి ఇవ్వడంతో అప్పులకు ఇబ్బంది లేకుండా రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత మార్చిలోనే 1.15 కోట్ల ఎకరాల సాగు నమోదయ్యే అవకాశం ఉం దని కేంద్రానికి వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికను పంపింది.

No comments:

Post a Comment