Breaking News

08/06/2019

ఇంటింటికి ఐదు మొక్కలు


ఖమ్మం, జూన్ 8 (way2newstv.in)
పంచాయతీరాజ్ చట్టంలో, “పదునైన” నిబంధనలతో పలుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడేందుకు, ప్రకృతి సంపదను పదిలంగా ఉంచుకోవాలనే ఆకాంక్షతో, ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో విధిగా నర్సరీలను అభివృద్ధి పరచి, ఇంటిటికీ మొక్కలను సరఫరా చేసి, ప్రతీ ఇంటిలో మొక్కలు వృక్షాలుగా ఎదగాలనే తలంపుతో కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిసింది. నూతన పంచాయతీ చట్టం ప్రకారం, నూతనంగా ఏర్పాటయ్యే పంచాయతీలతో సహా, ప్రతీ పంచాయతీ కార్యాలయం పరిధిలో, పంచాయతీ పరిధిలో ఉన్న నివాస గృహాలకు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిటికీ 5 మొక్కలను సరఫరా చేసే విధంగా, ప్రతీ పంచాయతీలో విధిగా నర్సరీలను పెంచాలని, ఆ నర్సరీలనుండి రాబోయే వర్షాకాలంలో, ప్రతీ ఇంటికి 5 మొక్కలను సరఫరా చేయాలని కఠిన నిబంధనలను పొందుపరచారు. 


ఇంటింటికి ఐదు మొక్కలు

మొక్కలను ఇంటి యజమానులకు అప్పగించిన తరువాత, మొక్కల సంరక్షణ భాధ్యత, గృహయజమానులే చూసుకోవాల్సి ఉంటుందని, నాటిన ప్రతి మొక్క చావకుండా పర్యవేక్షించాల్సిన భాధ్యతను ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు చూసుకోవాల్సి ఉంటుందని చట్టంలో పొందుపరచారు.గ్రామపంచాయతీల పరధిలో ప్రభుత్వ భూమిని గుర్తించాలంటే రెవెన్యూ అదికారులు చూసుకోవాల్సిన పనిఅని, పంచాయతీల పరిధిలో నర్సరీలు పెంచేందుకు, రక్షణ, నీటి వసతితోపాటు అనువైన ప్రదేశాలు దొరకడం కష్టంగా ఉందని అధికారులు పెదవివిరుస్తున్నారు. ఇకపోతే సర్పంచ్‌లు పదవీకాలం పూర్తి కావస్తున్నందున, ప్రభుత్వ ఆదేశాలను వారికి చేరవేసి సహకరించాలని అధికారులు కోరుతుండగా వారు తమ అనాసక్తిని ప్రదర్శిస్తున్నారని అధికార యంత్రాంగం వాపోతున్నారు. గతంలో హరితహారం పేరుతో మొక్కలను నాటినప్పటికీ ప్రస్తుతం ఎన్ని మొక్కలు బ్రతికి ఉన్నాయో? లేవో? తెలియని పరిస్థితి. మొక్కలను నాటడమే తప్ప వాటికి రక్షణ కల్పించడంలో, వాటికి నీటి సంరక్షణ కల్పించడంలో నిర్లక్షం వహించడంతో పధకం నీరుకారిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, చుట్టూ ప్రహరీలేదా కంచె రక్షణ ఉండి నీటివసతి కల్పించిన మొక్కలు మినహ, హరితహారం మొక్కలు దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. ఏదిఏమైనా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని చెపట్టేముందు సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే ప్రారంభిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.నర్సరీలలో పెంచిన మొక్కలను గృహయజమానులకు పంపిణీ చేసిన తరువాత, 85 శాతం మొక్కలను ఖచ్చితంగా బ్రతికించుకోవాలని, లేని పక్షంలో గృహ యజమానులకు 
ఇంటిపన్నుకు సమానంగా ఆపరాధ రుసుమును విధిచండానికి, పంచాయతీ కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు, చట్టంలో వీలుకల్పించారని తెలిసింది. ఇదిలా ఉండగా, పంచాయతీల పరిధిలో నర్సరీలను పెంచేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని, పంచాయతీ అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు అందినట్లు విశ్వసనయంగా తెలిసింది. మండలంలో సుమారు 8 వేల నివాసగృహాలుండగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంటికి 5 మొక్కలు చొప్పున 40 వేల మొక్కలు కావాల్సి ఉంది. మండలంలో ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో రెండునర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. ఇజిఎస్ పరిధిలో మరో నర్సరీలో మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ వారు పెంచిన మొక్కలు వారి అవసరాలకు సరిపోగా మిగిలినవి మాత్రమే ప్రజలకు పంచుతారు.

No comments:

Post a Comment