రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిటులైన సీనియర్ జర్నలిస్టు, రచయిత, సాహితీవేత్త టంకశాల అశోక్ సచివాలయం డీ బ్లాక్‌లోని కార్యాలయంలో ఈ రోజు ప్రభుత్వ సలహాదారుగా అశోక్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున టంకశాల అశోక్ అంతర్రాష్ట్ర సంబంధాల వ్యవహారాలు చూస్తారు..
ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన టంకశాల అశోక్
కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, బీసీ కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, అశోక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సంబంధాలు చాలా ముఖ్యమైనవని, వాటిని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు.
No comments:
Post a Comment