చెరువులో పడి మునిగి పోతున్న జింకను జిహెచ్ఎంసి లేక్ ప్రొటెక్షన్ సిబ్బంది సకాలంలో చూసి కాపాడారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నల్లగండ్ల చెరువు రక్షణ కోసం ఏర్పాటు చేసిన సిబ్బంది పరిసర ప్రాంతాల నుండి వచ్చిన జింక శుక్రవారం ఉదయం చెరువులో పడి మునిగిపోతుండడాన్ని గమనించారు.
జింకను కాపాడిన జీహెచ్ ఎంసీ సిబ్బంది
దీంతో లేక్ ప్రొటెక్షన్ సిబ్బంది చెరువులో కి దిగి తాళ్ల సహాయంతో బయటకు తీసి కాపాడారు. చెరువు లో నుండి తీసి కాపాడినఆ జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చెరువులో మునుగుతున్న జింకను సకాలంలో స్పందించి కాపాడడం తో పాటు సురక్షితంగా అటవీ అధికారులకు అందించడం పట్ల లేక్ ప్రొటెక్షన్ సిబ్బందిని జిహెచ్ఎంసి విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి అభినందించారు
No comments:
Post a Comment